నాడు గుజరాత్‌లో వాజుభాయ్-ప్రధాని: కుమారస్వామికి 'తండ్రి' షాక్, దేవేగౌడకు బీజేపీ దెబ్బకు దెబ్బ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 104 స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్ వాజుభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత యడ్యూరప్ప కర్ణాటక 23వ సీఎంగా ప్రమాణం చేశారు.
బల నిరూపణకు ఆయనకు పదిహేను రోజుల గడువు ఇచ్చారు. మరోవైపు, తనకు సంపూర్ణ మెజార్టీ ఉందని, ఇతర ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతూ గవర్నర్‌కు ఇచ్చిన లేఖను ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. దీంతో రేపు ఏమవుతుందనే ఉత్కంఠ అందరిలోను నెలకొంది.

1996లో బీజేపీ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసిన దేవేగౌడ, కాంగ్రెస్
దేవేగౌడను 'కర్మ' వెంటాడిందా? అంటే అవుననే అంటున్నారు. 1996లో గుజరాత్‌లో నాటి బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి డిస్మిస్ చేశారు. నాటి ప్రధానమంత్రి సలహాతో రాష్ట్రపతి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేశారు. శంకర్ సింగ్ వాఘేలా బీజేపీని చీల్చివేసి, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు.

బీజేపీ గవర్నమెంట్ డిస్మిస్: దేవేగౌడకు టిట్ ఫర్ టాట్
అప్పుడు గుజరాత్ బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా వాజుభాయి వాలా ఉన్నారు. ఇప్పుడు అదే వాజుభాయి వాలా కర్ణాటక గవర్నర్‌గా ఉన్నారు. అప్పుడు ప్రధానమంత్రిగా దేవేగౌడ ఉన్నారు. నాడు దేవేగౌడ, కాంగ్రెస్ పార్టీ అనైతికతకు బీజేపీ ప్రభుత్వం డిస్మిస్ అయిందని గుర్తు చేస్తున్నారు. నాడు గుజరాత్ చీఫ్‌గా ఉన్న వాజుభాయి ఇప్పుడు కర్ణాటక గవర్నర్‌దా ఉండగా, నాడు బీజేపీ ప్రభుత్వం డిస్మిస్ కావడానికి కారణమైన దేవేగౌడ.. కాంగ్రెస్‌తో జతకలిసి తన కొడుకు కుమారస్వామిని సీఎం చేద్దామనుకుంటే యడ్యూరప్ప వ్యూహాత్మకంగా అడ్డుకున్నాడు. కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్ పైన విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఆసక్తికర ట్వీట్
ఈ మేరకు సీ వోటర్ చీఫ్ ఎడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌ముఖ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. '1996లో ప్రధాని సలహాతో రాష్ట్రపతి బీజేపీ ప్రభుత్వాన్ని గుజరాత్‌లో డిస్మిస్ చేశారు. వాఘేలా బీజేపీని చీల్చి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నాడు గుజరాత్ హెడ్ పేరు వాజుభాయ్ వాలా. ప్రధాని పేరు దేవేగౌడ. కర్మ దెబ్బవేసింది ' అని పేర్కొన్నారు.
Recommended Video


ఆ బలంతోనే యెడ్డీ ప్రమాణ స్వీకారం
కాగా, కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. కుమారస్వామిని సీఎంగా చేయాలని నిర్ణయించాయి. కానీ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలలోని అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోంది. ఆ బలంతోనే యెడ్డీ ప్రమాణ స్వీకారం చేశారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications