నిర్లక్షంగా బైక్ పార్క్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా, వీడియో వైరల్!

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బైక్ ను సురక్షిత ప్రాంతంలోనే పార్క్ చెయ్యండి, జాగ్రత్తగా ఉండండి అంటూ కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారిణి, బెంగళూరు నగర ట్రాఫిక్ విభాగం డీఐజీ రూపా ట్వీట్టర్ లో ఓ షాకింగ్ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఓ దుకాణం ముందు సురక్షిత ప్రాంతం కాని చోట బైక్ పార్క్ చెయ్యడానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రమాదానికి గురైనాడు. ఓ వ్యక్తి ఎత్తైన ప్రాంతంలో బైక్ పార్క్ చెయ్యడానికి ప్రయత్నించాడు. అప్పటికే అక్కడ ఓ బైక్ పార్క్ చేశారు. సరిపడనంత స్థలం లేకపోవడంతో ముందుగా పార్క్ చేసిన బైక్ ప్రమాదవశాత్తు అతని మీద పడిపోయింది.

వెంటనే దుకాణం యజమాని అతనికి సహాయం చెయ్యడానికి వెళ్లారు. చుట్టుపక్కల ఉన్న వారు సైతం వీడియోలు తియ్యకుండా అతనికి సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం పూర్తి వివరాలు లేవు. గత నెల 20వ తేదీన ఈ ఘటన జరిగినట్లు దుకాణం ముందు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. సీసీకెమెరా క్లిప్పింగ్ లో ఆ వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karnataka DIG Roopa post a video in twitter
Please Wait while comments are loading...