employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!
ఉద్యోగుల (employees)కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లూ డీఏ (DA) పెంపు కోసం వారు ఎన్ని పోరాటాలు చేసినా, కోర్టులకు వెళ్లినా డీఏ పెంపుకు అంగీకరించకుండా పట్టుదల ప్రదర్శించిన ఆమె.. ఇవాళ పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న వేళ భారీ ప్రకటన చేశారు. ఉద్యోగులకు ఉన్న డీఏ బకాయిలన్నీ చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేయబోతోంది. అంతకు ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నుండి రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్ (DA) బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించడం ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది , గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల కార్మికులను కవర్ చేస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.

I am happy to announce that our Ma-Mati-Manush government has delivered on its promise to all its employees and pensioners, and to lakhs of teachers and non-teaching staff of our educational institutions, as well as employees/ pensioners of our other grant-in-aid instititions…
— Mamata Banerjee (@MamataOfficial) March 15, 2026
మా మా-మట్టి-మనుష్ ప్రభుత్వం దాని ఉద్యోగులు, పెన్షనర్లందరికీ, మా విద్యా సంస్థల లక్షలాది మంది ఉపాధ్యాయులు , బోధనేతర సిబ్బందికి, అలాగే పంచాయతీలు, మునిసిపల్ సంస్థలు, ఇతర స్థానిక సంస్థలు వంటి మా ఇతర గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల ఉద్యోగులు/పెన్షనర్లకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నట్లు మమత ట్వీట్ చేశారు. తమ ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్లలో వివరించిన విధానాల ప్రకారం వారు మార్చి 2026 నుండి వారి 2009 DA బకాయిలను పొందడం ప్రారంభిస్తారని దీదీ వెల్లడిచారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications