మొబైల్‌తో ఆధార్ లింకింగ్: గడువు తేదీపై కోర్టుకు తేల్చేసిన కేంద్రం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మొబైల్‌ వినియోగదారులు ఫిబ్రవరి 6, 2018లోగా తమ మొబైల్‌ ఫోన్‌ నెంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో 113 పేజీల కొత్త అఫిడవిట్‌ను కేంద్రం దాఖలు చేసింది.

అధార్‌-మెబైల్‌ ఫోన్‌ అనుసంధానంపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని కేంద్రం చెప్పింది. లోక్‌నీతి ఫౌండేషన్‌ కేసులో సుప్రీంకోర్టు మొబైల్‌-ఆధార్‌ అనుసంధానానికి అనుమతి ఇచ్చిందని వెల్లడించింది.

Linking Aadhaar with mobile: February 6 is last date

ఆధార్‌ లేకపోవడం కారణంగా దేశంలో ఎక్కడా ఆకలి చావులు నమోదు కాలేదని కూడా కేంద్రం ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. మొబైల్‌తో ఆధార్‌ అనుసంధానం గడువును కూడా మార్చేదిలేదని స్పష్టం చేసింది.

అయితే ప్రస్తుత బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం గడువును మార్చి 31 వరకూ పొడగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతేగాక, ఇప్పట్నుంచి కొత్త బ్యాంక్‌ ఖాతాలు తెరవడానికి ఆధార్‌ తప్పనిసరి అని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Read in English: Linking Aadhaar with mobile
English summary
February 6th, 2018 will be the last date to link Aadhaar with mobile, the Centre has said. In an affidavit that runs into 113 pages, the Centre told the Supreme Court that, it was the court that approved the norm for mandatory linking of Aadhaar in the Lokniti Foundation case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి