వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేకిన్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ‌గా గుర్తింపు పొందింది: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్‌గా గుర్తింపు పొందిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడి భారతీయులతో సమావేశమై ప్రసంగించారు. భారత్‌లో ఉత్పత్తుల తయారీకి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ముఖ్యంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తోందని మోడీ చెప్పారు.

మేకిన్ ఇండియా ఒక బ్రాండ్‌లా తయారైంది

మేకిన్ ఇండియా ఒక బ్రాండ్‌లా తయారైంది

మేకిన్ ఇండియా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌గా గుర్తింపు పొందింది. కేవలం భారత ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ దేశాల ప్రయోజనాల మేరకు కూడా భారత్‌లో ఉత్పత్తులు తయారవుతున్నాయన్నారు. ప్రత్యేకించి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో భారత్ దూసుకెళుతోందన్నారు. 13వ భారత్ జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు జపాన్‌కు శనివారం చేరుకున్న ప్రధాని మోడీ ఆదేశ ప్రధాని షింజో అబేతో 8గంటల పాటు సమయం గడిపారు. షిజో ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను మోడీ కొనియాడారు.

వేగంగా పరివర్తన చెందుతున్న దేశం భారత్

వేగంగా పరివర్తన చెందుతున్న దేశం భారత్

"భారతదేశం నేడు పరివర్తన చెందుతోంది. సేవా రంగం, మానవత్వంలో ముందున్న భారత్‌ను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. భారత్‌లో మా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు, ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి" అని ప్రధాని మోడీ తెలిపారు. అంతరిక్ష రంగంలో కూడా భారత్ దూసుకెళుతోందని.. 2022 నాటికల్లా అంతరిక్షంలోకి మనిషి ఉన్న రాకెట్‌ను పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైయ్యాయని తెలిపారు.

 2022 నాటికి అంతరిక్షంలోకి గగన్‌యాన్

2022 నాటికి అంతరిక్షంలోకి గగన్‌యాన్

గతేడాది అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపి మన దేశ శాస్త్రవేత్తలు రికార్డు నెలకొల్పారని గుర్తు చేసిన ప్రధాని మోడీ చంద్రయాన్, మంగళయాన్‌లను అతి తక్కువ ఖర్చుతో నింగిలోకి పంపగలిగామని వెల్లడించారు. 2022 కల్లా గగన్‌యాన్‌ను కూడా నింగిలోకి పంపుతామని ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని...ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతోందని ఇందులో ప్రయాణించే వారుకూడా భారతీయుడే ఉంటారని చెప్పారు. భారత స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మనిషితో కూడిన రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నామని ప్రధాని మోడీ తన ప్రసంగంలో చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే నింగిలోకి మానవుడిని విమానంలో పంపిన దేశాల్లో నాల్గవ దేశంగా భారత్ నిలుస్తుంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా దేశాలు నింగిలోకి విమానం ద్వారా మానవుడిని పంపించాయి.

English summary
Prime Minister Narendra Modi on Monday described Make in India as a “global brand” while underlining his government’s initiative to boost manufacturing in India, particularly in mobile phone manufacturing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X