వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ ఎన్నికలు: జాతుల సమస్యే సంక్లిష్టం

ఈ నెల నాలుగో తేదీన, 8వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని హర్యానాలో సగంగా ఉండే మణిపూర్ రాష్ట్ర జనాభా ముంబై నగర జనాభాలో మూడో వంతు ఉంటుంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాల్లో ఒకటి మణిపూర్. ఈ రాష్ట్రానికి నిత్యావసర వస్తువులు రావాలంటే ఇంఫాల్ - దిమాపూర్, ఇంపాల్ - సిల్చార్ రోడ్లే శరణ్యం. నిరుద్యోగ సమస్య, దారిద్ర్యంతో సతమతం అవుతున్న ప్రజలు, అభివ్రుద్ధిలో వెనుకబడ్డ రాష్ట్రంగా గుర్తింపు పొందింది.

ఈ నెల నాలుగో తేదీన, 8వ తేదీన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లోని హర్యానాలో సగంగా ఉండే మణిపూర్ రాష్ట్ర జనాభా ముంబై నగర జనాభాలో మూడో వంతు ఉంటుంది. 30కి పైగా గిరిజన తెగలకు చెందిన వారు ఉంటారు. ఆరుకు పైగా ఏర్పాటువాద సంస్థల ప్రాబల్యం గల రాష్ట్రం కూడా. ఈ ఎన్నికల్లో ప్రధానంగా జాతుల ఆధిపత్యం అగ్నిగుండంగా మారింది. దాని ఫలితంగానే గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి మణిపూర్ ఆర్థిక దిగ్బంధం నిర్విఘ్నంగా సాగుతూనే ఉన్నది.

దీనికి ఇబోబిసింగ్ ప్రభుత్వం కొత్తగా ఏడు జిల్లాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయమే కారణం. నాలుగు నెలల పాటు నిరంతరాయ ఆర్థిక దిగ్బంధం వల్ల వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.1000 (న్యూఢిల్లీలో రూ.651.50), లీటర్ పెట్రోల్ ధర రూ.200 (ఢిల్లీలో రూ.71.33) పలుకుతున్నదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సమీప భవిష్యత్‌లో మణిపూరీల్లో శాంతి నెలకొంటుందన్న ఆశలు కనిపించడం లేదని ఇంఫాల్ ఫ్రీ ప్రెస్ ఎడిటర్ ప్రదీప్ ఫంజౌబాం తెలిపారు. దీనికి తోడు 2016 డిసెంబర్ ఎనిమిదో తేదీన మణిపూర్ ప్రభుత్వం ఏడు జిల్లాలను 14 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీచేయడంతో పరిస్థితి మరింత విషమించింది.

Manipur Election 2017: Ethnic conflict in state overshadows India's lowest infant mortality rate

ఆజ్యం పోసిన కొత్త జిల్లాలు

మణిపూర్ ప్రభుత్వం తమను సంప్రదించకుండానే కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నదని 'యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్‌సి)' ఆరోపిస్తున్నది. కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఉపసంహరణతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగా గ్రూప్ సంస్థలు ఆందోళనకు దిగారు. కానీ ప్రభుత్వం మాత్రం సుపరిపాలన కోసమే జిల్లాలను విభజించామని వాదిస్తోంది. అదే సమయంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా నియోజకవర్గాలను మార్చబోమని కూడా వివరణ ఇచ్చింది.

తగ్గిన వ్యక్తిగత ఆదాయం

నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారమే మణిపూర్ పౌరుల వ్యక్తిగత ఆదాయం రూ.24,042. మణిపూరీ పౌరుల ఆదాయం దేశంలోని ఇతర రాష్ట్రాల పౌరుల కంటే తక్కువ. గత పదేళ్లుగా తగ్గుముఖం పడుతోంది. ప్రగతిలో వెనుకడుగు అత్యధికంగా పట్టణ నిరుద్యోగ సమస్య అతి తక్కువగా ఉన్నది. నిరుద్యోగుల్లో 18 - 29 మధ్య ఏళ్ల వయస్కులే. అంతే కాదు ప్రతి వెయ్యి మందికి 139 మంది ఉపాధి లేక ఇబ్బందుల పాలవుతున్నారు.రాష్ట్ర జనాభాలో వారు 23.3శాతం గల వారే. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉన్నది. కానీ ఇది ఆర్థిక దిగ్బంధానికి కారణం కాదని ఇంఫాల్ ఫ్రీ ప్రెస్ ఎడిటర్ ఫాంజౌబం పేర్కొన్నారు. మూడోవంత మణిపూరీలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి.

శిశు మరణాలు చాలా తక్కువే

అతి తక్కువ శిశు మరణాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఇదొకటిగా ఉన్నది. వెయ్యి మందికి తొమ్మిది మరణిస్తున్నారు. ఇది బ్రెజిల్, అర్జెంటీనా, సౌదీ అరేబియాల కంటే తక్కువగా శిశు మరణాలు రికార్డవుతున్నాయని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెప్తున్నాయి. ప్రతి వెయ్యి మందికో వైద్యుడు అందుబాటులో ఉన్నారు. భారత్ లోని ఇతర ప్రాంతాల్లో 1700 మందికో వైద్యుడు అందుబాటులో ఉన్నారు. కానీ మణిపూర్ రాష్ట్రంలో వైద్యులు, నర్సులు ఇతర వసతులు బాగానే ఉన్నాయని ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్తున్నది.

2009 తగ్గిన వేతనాలు

2009 నుంచి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న మణిపూరీల జీవన స్థితిగతులు మరింత దగజారాయి. 2011 - 12లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత ఆదాయం రూ.1118, పట్టణాల్లో రూ.1170 అని గణాంకాలు చెప్తున్నాయి. మణిపూర్ కంటే జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మాత్రమే అత్యధిక పౌరులు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లు రికార్డుల

1960వ దశశంలో ఏర్పాటు ఉద్యమాలు మొదలు

30 శాతానికిపైగా రాష్ట్ర జనాభా గల మణిపూర్ రాష్ట్రంలో 1960వ దశకం ప్రారంభం నుంచే ఏర్పాటువాద ఉద్యమాలు మొదలయ్యాయి. రెండు నాగా గ్రూపులతో మొదలైన ఉద్యమం మణిపూర్ లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని గ్రేటర్ నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపించింది. మణిపూర్‌లో గిరిజన జాతుల్లో మీటీలు, కుకీలతో నాగాలు కూడా కీలకమే. మీటీలతో ఏర్పాటైన తీవ్రవాద సంస్థలు భారత్ నుంచి విముక్తి కోసం పోరాటం ప్రారంభించాయి. 209 తర్వాత క్రమంగా వేర్పాటువాద సంస్థల దాడులు తగ్గముఖం పట్టాయి. 90 శాతం కార్యక్రమాలు తగ్గాయి. 2006లో 107 మంది పౌరులు, 37 మంది భద్రతాధికారులు మరణిస్తే 2016 నాటికి 14 మంది పౌరులు, 11 మంది భద్రతాధికారులు మరణించారని రికార్డులు చెప్తున్నాయి.

సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం కూడా సమస్యే

మిగతా రాష్ట్రాలతోపాటు 59 ఏళ్ళుగా ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్ఎస్‌పిఎ) మణిపూర్‍లోనూ అమలవుతోంది. ఇది కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లవుతున్నది. ఐదుగురు కంటే ఎక్కువగా ఒకచోట గుమిగూడటం కూడా నేరం అవుతుంది. ఎటువంటి అరెస్ట్ వారంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తున్నది. దీని ఫలితం కొన్ని పొరపాట్లకు దారి తీసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఇరోమ్ షర్మిల 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేశారు. ఇటీవలే దీక్ష విరమించి కొత్త పార్టీని స్థాపించారు. షర్మిల ఏర్పాటుచేసిన పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్ (పీఆర్‌జెఎ)తోపాటు బీజేపీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎన్నికల బరిలో నిలిచాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో తలపడుతున్నాయి.

English summary
The economic blockade of the Imphal-Dimapur road and the Imphal-Silchar road, through which most goods are brought into the state, has overshadowed all other issues this election year in Manipur, the north-eastern state with one of India’s highest poverty rates, high youth unemployment, and low growth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X