Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవీ ముంబై ఎయిర్‌ పోర్ట్ నుంచి సర్వీసులు స్టార్ట్.. ప్రత్యేకతలు ఇవే..

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. బెంగళూరు నుంచి నవీ ముంబై ఎయిర్ పోర్టుకు తొలి విమానం చేరుకుంది. ఈ విమానాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆపరేట్ చేసింది. మరో విమానం నవీ ముంబై ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయల్దేరింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 8న ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ్టి నుంచి ఈ ఎయిర్ పోర్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ తగ్గే అవకాశం ఉంది.

నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) తన కార్యకలాపాలను ప్రారంభించడంతో, ముంబై విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇండిగో తొలి వాణిజ్య విమానంతో NMIA తన సేవలను ప్రారంభించింది. దీంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) రద్దీని తగ్గడమే కాకుండా ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం కానుంది.

డిసెంబర్ 24, 2025న బుధవారం NMIAలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. బెంగళూరు నుంచి వచ్చిన ఇండిగో విమానం 6E460 ఉదయం 8:00 గంటలకు నవీ ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఈ క్రమంలో విమాన ప్రయాణాల్లో ముఖ్య సందర్బాలలో ఇచ్చే 'వాటర్ క్యానన్ సెల్యూట్' ను దీనికి అందించారు. ఈ మేరకు ఈ తొలి ప్రయాణికుల విమానం NMIAలో షెడ్యూల్డ్ సేవలకు నాంది పలికింది.

కొద్దిసేపటికే, హైదరాబాద్‌ వెళ్లాల్సిన ఇండిగో విమానం 6E882 ఉదయం 8:40 గంటలకు బయలుదేరింది. దీంతో NMIA తన ప్రారంభ రోజు మొదటి రాకపోకలను పూర్తిచేసింది. నవీ ముంబైలో షెడ్యూల్డ్ ప్రయాణీకుల కార్యకలాపాల ప్రారంభం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)కు వాయు రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి కీలకమైనది.

Mumbai s Second Gateway Takes Flight NMIA Welcomes First IndiGo Arrival from Bengaluru with Water Salute

NMIA పూర్తిగా సేవలను ప్రారంభించిన నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న CSMIA రద్దీని గణనీయంగా తగ్గనుంది. దాంతో పెరుగుతున్న ప్రయాణీకులు, కార్గో డిమాండ్‌ ను తీర్చగల సామర్థ్యాన్ని పెంచుతుంది. గ్రీన్‌ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసిన NMIA, ఆర్థిక వృద్ధి, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి ఒక ముఖ్య విమానయాన కేంద్రంగా తోడ్పడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+