నిర్భయను తలపించిన ఘటన: పసికందు నోరు మూసి దారుణం!
దేశంలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. పండు ముసలి నుంచి పసికందుల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని అట్కోట్లో హృదయాన్ని కలచివేసే ఘటన జరిగింది.అక్కడ ఆరేళ్ల బాలికపై 'నిర్భయ' తరహాలో అమానుషంగా దాడి జరిగింది. నిందితుడు మొదట చిన్నారిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నం విఫలమవడంతో ఆ పసికందు ప్రైవేట్ పార్ట్‌లో రాడ్ పెట్టాడు. ఈ దారుణం డిసెంబర్ 4న జరిగింది. ఘటన జరిగిన అనంతరం తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స జరుగుతోంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి
నిందితుడిని మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రామ్‌సింగ్ తేర్‌సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దాదాపు 100 మంది అనుమానితులను విచారించారు.
బాధితురాలి కుటుంబం దాహోద్ జిల్లాకు చెందినవారు. వారు అట్కోట్లోని ఒక గ్రామంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. నిందితుడు తేర్‌సింగ్ కూడా బాధితురాలి కుటుంబం పనిచేసే పొలం పక్కనే ఉన్న పొలంలో పనిచేస్తున్నాడు.

నోరు మూసి, దారుణానికి పాల్పడిన నిందితుడు
ఘటన జరిగిన రోజున చిన్నారి కుటుంబం పొలంలో పని చేస్తుండగా.. తేర్‌సింగ్ దొంగచాటుగా వచ్చి ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. పొలం పక్కనే ఉన్న ప్రాంతంలో బాలిక నోరు మూసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. అయితే చిన్నారి గట్టిగా అరుస్తుండడంతో ఆ నిందితుడు ఆగ్రహంతో ఆమె ప్రైవేట్ పార్ట్‌లో రాడ్ చొప్పించాడు. ఆ తర్వాత రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని అక్కడే వదిలి పరారయ్యాడు. కొంతసేపటికి చిన్నారి కుటుంబం ఆమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకోగా.. గాయాలపాలైన స్థితిలో బాలికను చూసి వెంటనే రాజ్‌కోట్‌లోని ఆసుపత్రికి తరలించారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
రాజ్‌కోట్ రూరల్ ఎస్పీ విజయ్‌సింగ్ గుర్జర్ మాట్లాడుతూ.. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించినట్లు తెలిపారు. పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేసి 100 మందిని విచారించారు. అనంతరం బాలల నిపుణుల సమక్షంలో పది మంది అనుమానితులను చిన్నారికి చూపించగా, ఆమె నిందితుడు తేర్సింగ్ను గుర్తించింది. నిందితుడు తేర్‌సింగ్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications