వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా థర్డ్ వేవ్ ముప్పుకు సంబంధించి ఆధారాలు లేవు: హెల్త్ డైరెక్టర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కేసుల తీవ్రత తగ్గినప్పటికీ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై ఇప్పటి వరకు సరైన ఆధారాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు 30 లక్షల మందికి పైగా రెండో డోస్ తీసుకునేవారు ఉన్నారని తెలిపారు. హైదరాబాదులో 100కు పైగా వ్యాక్సినేషన్ కేంద్రాల్లో 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేస్తున్నట్టు శ్రీనివాసరావు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. గత రెండేళ్లలో సీజనల్ వ్యాధులు కూడా తగ్గాయని చెప్పారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని మలేరియా ఫ్రీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

no evidence on corona third wave:HD

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

English summary
no evidence on corona third wave health director srinivasa rao said. corona virus intensity is decreased in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X