వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పదో తరగతి మ్యాథ్స్కు మళ్లీ పరీక్ష లేదు: విద్యార్థులకు సీబీఎస్ఈ ఊరట
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు తిరిగి నిర్వహించేది లేదని ప్రభుత్వం మంగళవారం తేల్చి చెప్పింది. పరీక్షా పత్రం లీకేజీ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. మ్యాథ్స్ పరీక్షా పత్రం లీకైనట్లు వార్తలు వచ్చాయి.
అయితే, మ్యాథ్స్ పరీక్షను తిరిగి నిర్వహించేది లేదని చెప్పారు. ఈ ప్రకటనతో లక్షలాదిమంది పదో తరగతి విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటారు. మ్యాథ్స్ పరీక్ష మార్చి 28వ తేదీన నిర్వహించారు. అయితే ఇది లీకైనట్లు వార్తలు రావడంతో మళ్లీ పరీక్ష పెట్టవచ్చునని భావించారు.

ఈ పరీక్షలు హర్యానా, ఢీలాలీ ఎన్సీఆర్ తదితర ప్రాంతాల్లో జూలైలో నిర్వహించే అవకాశముందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు రీ ఎగ్జామ్స్ ఉండవని తేల్చేశారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ ఎక్కడా పరీక్షలు నిర్వహించడం లేదని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అనిల్ స్వరూప్ ట్వీట్ చేశారు.