కర్ణాటక: బిజెపి కొంపముంచిన 9 సీట్లు, 6730 ఓట్లొస్తే కమలానికి 113 సీట్లు
బెంగుళూరు: తొమ్మిది స్థానాల్లో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓటమి పాలైంది. దీంతో కర్ణాటక రాష్ట్రంలో కనీస మెజారిటీకి బిజెపి దూరం కావడానికి ఈ 9 స్థానాల్లో ఓటమి పాలు కావడమే కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు సుమారు 6730 ఓట్లు బిజెపిని కనీస మెజారిటికి దూరం చేశాయి.
కర్ణాటక రాష్ట్రంలో మే 12 వ తేదిన జరిగిన ఎన్నికల్లో బిజెపికి 104 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు, జెడి(ఎస్)కు 38 సీట్లు , ఇద్దరు స్వతంత్రులు ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కానీ, గవర్నర్ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారు.
కనీస మెజారిటీకి బిజెపి దూరంగా నిలిచింది. సుమారు 9 అసెంబ్లీ స్థానాల్లో బిజెపి అభ్యర్ధులు అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈ సీట్లలో బిజెపి అభ్యర్ధులు విజయం సాధిస్తే బిజెపి ఇంతగా కష్టపడాల్సిన అవసరం లేకుండాపోయేది.

ఆ 9 సీట్లలో బిజెపి గెలిస్తే
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీస మెజారిటీకి 8 సీట్ల దూరంలో బిజెపి నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో బిజెపి 9 సీట్లలో అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైంది.
మస్కీలో బిజెపి అభ్యర్ధి 213 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. హిరెకెరూర్ లో 555 ఓట్లతో బిజెపి అభ్యర్ధి ఓడిపోయాడు. కుండ్‌గోల్ లో 634 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాడు. ఎల్లాపూర్ లో 1483 ఓట్లతో బిజెపి అభ్యర్ధి ఓడిపోయాడు. బదామిలో 1696 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి సిద్దరామయ్య విజయం సాధించారు. శృంగేరీలో 1999 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాడు. అధానీలో బిజెపి అభ్యర్ధి 2331 ఓట్లతో ఓటమి పాలయ్యాడు. బళ్ళారి గ్రామీణ సెగ్మెంట్లో 2679 ఓట్ల తేడాతో బిజెపి అభ్యర్ధి ఓటమి పాలయ్యాడు.

బిజెపిదే అధికారం
బిజెపి ఓటమిపాలైన 9 సీట్లలో ఆ పార్టీకి 6730 ఓట్లు వస్తే ఆ పార్టీ కనీస మెజారిటీ లభించేది. 9 సీట్లలో అతి తక్కువ ఓట్లతోనే ప్రత్యర్ధుల చేతిలో బిజెపి అభ్యర్ధులు ఓటమిపాలయ్యారు. ఈ 9 సీట్లలో బిజెపి అభ్యర్ధులకు 6730 ఓట్లు లభిస్తే పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.అయితే ఈ స్థానాల్లో ఓటమి పాలైన అభ్యర్ధులు ఇంకాస్త గట్టిగా ప్రయత్నం చేస్తే విజయం సాధించేవారే.

మస్కీలో బిజెపి అభ్యర్ధి తక్కువ ఓట్లతో ఓటమి
మస్కీలో బిజెపి అభ్యర్ధి 213 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 60367 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్ధికి 60174 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు పార్టీల అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం 213 మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి వచ్చిన మెజారిటీలో సుమారు 100 ఓట్లు మారితే గెలుపు ఓటములు మారేవి. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బదులుగా బిజెపి అభ్యర్ధి విజయం సాధించేవాడు.

హెరెకెరూర్ లో బిజెపి అభ్యర్ధి 555 ఓట్లతో ఓటమి
హెరెకెరూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 72461 ఓట్లు లభించాయి. బిజెపి అభ్యర్ధికి 71906 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి 555 ఓట్ల మెజారిటీ లభించింది. అయితే 278 ఓట్లు అటు ఇటుగా మారితే గెలుపు ఓటములు మారేవి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బదులు బిజెపి అభ్యర్ధి విజయం సాధించేవాడు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications