వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎఫ్ఐ ట్విట్టర్ ఖాతా తొలగింపు; బ్యాన్ తో కొనసాగుతున్న మెగా డిజిటల్ అణచివేత

|
Google Oneindia TeluguNews

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు దాని ఎనిమిది అనుబంధ ఫ్రంట్‌లను ఐదేళ్లపాటు కేంద్రం నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించిన ఒక రోజు తర్వాత, ట్విట్టర్ గురువారం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధికారిక ట్విట్టర్ ఖాతాను తొలగించింది. దీంతో సదరు ఉగ్రవాద సంస్థ మెగా డిజిటల్ అణిచివేతను ఎదుర్కొంది.

పీఎఫ్ఐ అధికారిక ట్విట్టర్ ఖాతాను తొలగించిన ట్విట్టర్

పీఎఫ్ఐ అధికారిక ట్విట్టర్ ఖాతాను తొలగించిన ట్విట్టర్

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియామరియు దాని ఎనిమిది అనుబంధ సంస్థల వెబ్‌సైట్‌లు మరియు సోషల్ మీడియా ఖాతాలను చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధించిన తర్వాత వారి కార్యకలాపాలను ప్రచారం చేయకుండా నిరోధించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇస్లామిక్ అతివాద సంస్థల దాని అనుబంధ సంస్థల ఇళ్లు కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఇటీవల చేపట్టిన భారీ ఆపరేషన్లో 250 మందికి పైగా పి ఎఫ్ ఐ సభ్యులను, కార్యకర్తలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది.

దేశ వ్యాప్తంగా 17రాష్ట్రాల్లో పీఎఫ్ఐ .. ఉగ్రవాద శిక్షణ

దేశ వ్యాప్తంగా 17రాష్ట్రాల్లో పీఎఫ్ఐ .. ఉగ్రవాద శిక్షణ


పిఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయని, హింస నేరాలు ఉగ్రవాదం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అనేక కేసుల్లో పి ఎఫ్ ఐ సభ్యులు నిందితులుగా ఉన్నారని, మత విద్వేషాలను రెచ్చగొట్టడం లక్ష్యంగా ఈ సంస్థ సభ్యులకు శిక్షణ ఇస్తోందని కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. పలు రాష్ట్రాలలో పి ఎఫ్ ఐ సభ్యులు దాని అనుబంధ సంస్థల పై 1300 పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పిఎఫ్ ఐ కి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో సంబంధాలున్నాయని కూడా పలు కీలక ఆధారాలు దర్యాప్తు సంస్థ అధికారుల చేతికి చిక్కాయి.

పీఎఫ్ఐ ని ఐదేళ్ళ పాటు బ్యాన్ చేసిన ప్రభుత్వం.. ట్విట్టర్ ఖాతా తొలగించిన ట్విట్టర్

పీఎఫ్ఐ ని ఐదేళ్ళ పాటు బ్యాన్ చేసిన ప్రభుత్వం.. ట్విట్టర్ ఖాతా తొలగించిన ట్విట్టర్


టెర్రర్ ఫండింగ్‌లో మరియు గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో లింకులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి అన్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఈడి అధికారుల ప్రకటనతో రాడికల్ సంస్థను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం నిషేధించింది. వివిధ రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ కార్యకర్తలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు రెండో విడతగా దాడులు చేసిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రెండు దాడుల్లో 250 మందిని అరెస్టు చేసి, అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక తాజాగా పీఎఫ్ఐ వెబ్ సైట్ లను, ట్విట్టర్ ఖాతాను తొలగించి సంస్థపై ఉక్కుపాదం మోపారు.

English summary
Twitter on Thursday down the official Twitter account of the Popular Front of India after the Center banned the Popular Front of India for indulging in terrorist activities. With this, PFI faced mega digital suppression..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X