ఉత్తరాఖండ్‌పై బీజేపీ ఫోకస్: వచ్చేనెలలో ప్రధాని మోడీ క్యాంపెయిన్ స్టార్ట్
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తోన్నాయి. వచ్చే ఏడాది ఎన్నిక జరగనున్న.. ప్రధాన పార్టీలు ఓటరు దేవుళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలా ఆయా రాష్ట్రాలపై ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. ఉత్తరాఖండ్‌పై బీజేపీ దృష్టి పడింది. వచ్చే నెల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ ఉత్తరాఖండ్ ఇ:చార్జీ ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. డిసెంబర్ మొదటివారం నుంచి మోడీ క్యాంపెయిన్ ఉంటుందని వివరించారు. కానీ తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆయన వివరించారు.
డెహ్రాడూన్‌లో రెండురోజుల సమావేశం జరుగుతుంది. మీటింగ్‌కు జోషి హాజరయ్యారు. సమావేశంలోనే.. తేదీ ఖరారు చేస్తామని ఆయన వివరించారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు తాము సంసిద్దంగా ఉన్నామని వివరించారు. తమ పార్టీ క్షేత్రస్థాయిలో రెడీగ ఉందని వివరించారు. తమకు ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు.

Recommended Video
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఏ నెల అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటినుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఓటరు నాడీ పట్టుకొని.. అధికారం చేపట్టాలని భావిస్తున్నాయి. కానీ వయోజనులు ఎవరికీ ఓటు వేస్తారో.. ఎవరికీ పట్టం కడతారో తెలియాలంటే.. మరికొద్దీ రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications