Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిశోర చాణక్యం : వైసీపీ విజయం కోసం స్ట్రాటజీస్, పాటలు, స్లోగన్లతో అట్రాక్ట్

హైదరాబాద్ : అతనో మేధావి. సాదాసీదా తెలివిమంతుడు కాదు .. ప్రజల నాడీ అంచనావేసి పార్టీలకు మేలు చేసే ఆక్టోపస్. అతను చెప్పినట్టు విన్నారో ఇక అంతే మీ ముందు పదవీ వచ్చి వాలుతుంది. అతనే ప్రశాంత్ కిశోర్. 2014లో మోదీని గద్దెనెక్కించింది. ఇప్పుడు ఏపీలో జగన్‌కు అధికారం కట్టబెట్టింది కిశోరే.

కిశోర చాణక్యం ..

కిశోర చాణక్యం ..

కిశోర్ చాణక్యాన్ని జగన్ తు.చ తప్పకుండా పాటించారు. ఎన్నికల్లో ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపికను కూడా ఫాలో అయ్యారు. ఏపీలో .. అదీ చంద్రబాబు సీఎంగా ఉన్న ఇలాకాలో కిశోర్ చాణక్యం పనిచేయడమంటే సాధారణ విషయమేమి కాదు. ఆయన ఎత్తులతో వైసీపీ 151 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అలాగే 22 లోక్ సభ సీట్లలో కూడా విజయం సాధించింది.

జగన్ రాజకీయ ఆరంగ్రేటం

జగన్ రాజకీయ ఆరంగ్రేటం

2009లో వైఎస్ఆర్ చనిపోయాక .. జరిగిన పరిణామాలతో జగన్ పార్టీ స్థాపించారు. 2009 నుంచి దాదాపు పదేళ్లపాటు ప్రజలతో మమేకమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తన వాణిని వినిపించారు. రాష్ట్ర విడిపోయాక జరిగిన ఎన్నికల్లో విపక్షంతో సరిపెట్టుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీచేయకపోవడంతో టీడీపీకి కలిసొచ్చింది. ఇక ప్రజలతో పాదయాత్ర, ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మమేకమవుతూనే ఉన్నారు. గత ఎన్నికల్లో 45.4 శాతం ఓటు శాతంతో 66 సీట్లు సాధించగా .. 48.2 శాతం ఓటు షేర్ తో టీడీపీ 103 సీట్లు సాధించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ .. లూప్ హోల్స్ పై ఫోకస్ చేశారు. జగన్ ను బలోపేతం చేసేందుకు వ్యుహరచన చేశారు.

షా వ్యుహాలతో ..

షా వ్యుహాలతో ..

గతంలో అమిత్ షా అనుసరించిన వ్యుహన్ని ఏపీలో అమలు చేశారు. బూత్ స్థాయిలో కమిటీలు చేసి .. పార్టీని మరింత బలోపేతం చేశారు. ఇవి మంచి ఫలితాలిచ్చాయి. 2017లో బీహర్ లో జేడీయూ ఎలా అధికారంలోకి వచ్చిందో పరిశీలించి .. అంచనా వేసి ఏపీలో కూడా అదే విధానాన్ని అమలు చేశారు. అంతేకాదు 2012లో మొదటిసారి మోదీ సీఎం అయ్యేందుకు కూడా ప్రశాంత్ కిశోర్ సలహాలు, సూచనలు పనిచేశాయి. తర్వాతే 2014లో మోదీ వెన్నంటి ఉండి ... సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశారు.

 ఒక టీం పనిచేసింది

ఒక టీం పనిచేసింది

ఏపీలో వ్యుహరచన కోసం ప్రశాంత్ కిశోర్ తన టీంనే రంగంలోకి దింపారు. ఏపీలో ప్రజలతో ప్రత్యక్షంగా కలుసుకొని అభిప్రాయం సేకరించారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో తీసిన రావాలి జగన్, కావాలి జగన్ రూపకల్పన చేసింది కిశోర్ టీం. ఇది సోషల్ మీడియాలో ఎక్కువ చక్కర్లు కొట్టింది. దాదాపు 2.25 కోట్ల వ్యుహర్ షిప్ వచ్చింది. అదేవిధంగా మంచి మంచి స్లోగన్స్ కూడా ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ఇవి పనిచేశాయి. దీంతో ప్రజలు చంద్రబాబును .. నిన్ను నమ్మను బాబు, బై బై బాబు అని తీర్పిచ్చారు. వాస్తవానికి టీడీపీ కూడా మల్లీ నువ్వే రావాలి అని జగన్ కు కౌంటర్ గా నినాదం ఇచ్చిన జనంలోకి అంతగా వెళ్లలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+