MNREGA: ఉపాధి హామీ పథకం పేరు మార్పు..! ఏంటీ మైండ్ సెట్ అన్న ప్రియాంక..!
2005లో యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలో ఎన్డీయే సర్కార్ తాజాగా మార్చేసింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎం నరేగా)గా ఉన్న పేరు కాస్తా పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్ గార్ గా మర్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాతిపిత పేరుతో ఉన్న పథకం పేరు మార్చడం ద్వారా ఏం సాధిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఉపాధి హమీ పథకం పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా తప్పుబట్టారు. ఎంనరేగా పేరును పూజ్య బాపు గ్రామీణ రోజ్గా మార్చడంపై స్పందిస్తూ.. "దీని వెనుక ఏ మనస్తత్వం ఉందో నాకు అర్థం కాలేదు. అన్నింటిలో మొదటిది, ఇది మహాత్మా గాంధీ పేరు, మరియు పేరు మార్చబడినప్పుడు, ప్రభుత్వ వనరులు మళ్ళీ దానిపై ఖర్చు చేయబడతాయి... ఇది డబ్బు ఖర్చు చేసే పెద్ద ప్రక్రియ, కాబట్టి అనవసరంగా ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? నాకు అర్థం కాలేదు." అంటూ ఫైర్ అయ్యారు.

#WATCH | Delhi: On the renaming of the MNREGA to Pujya Bapu Grameen Rozgar, Congress MP Priyanka Gandhi Vadra says, "I can't understand what mentality is behind this. First of all, this is Mahatma Gandhi's name, and when the name is changed, the government's resources are spent… pic.twitter.com/y4Eh7xq2x8
— ANI (@ANI) December 13, 2025
మరోవైపు ఇతర ప్రతిపక్ష పార్టీలు, విమర్శకులు కూడా ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయ నిర్ణయంగా ఖండిస్తున్నారు. గతంలో తాము విమర్శించిన, ప్రజాదరణ పొందిన పథకాన్ని కేంద్రం తమదిగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాజా మార్పును అసలు ఉపాధి హామీ పథకం వారసత్వాన్ని తుడిచిపెట్టి, దానిని ప్రస్తుత ప్రభుత్వ సొంత పథకంగా మార్పు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications