బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్‌లో లేడీ టెక్కీ హత్య - బతిమాలిన గార్డ్..: అసలేం జరిగింది?

25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య కేసులో పోలీసులు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

పుణే: 25 ఏళ్ల మహిళా ఇన్ఫోసిస్ టెక్కీ ఆనంద్ కే రసిలా రాజు హత్య కేసులో పోలీసులు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఆమె ఆదివారం నాడు చనిపోయారు. ఆమెను కంప్యూటర్ కేబుల్‌తో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

గార్డుతో వాగ్వాదం

గార్డుతో వాగ్వాదం

అంతకుముందు రోజు అంటే శనివారం నాడు ఆమె సెక్యూరిటీ గార్డు బాబెన్ సైకియాతో గొడవ పడ్డారు. అతని పైన ఫిర్యాదు చేస్తానని ఆమె గార్డును బెదిరించినట్లుగా తెలుస్తోంది. అతను తనను అదోలా చూడటంతో ఆమె వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. సదరు గార్డు అసోంకు చెందిన వాడు.

ఆదివారం మధ్యాహ్నం..

ఆదివారం మధ్యాహ్నం..

ఆ సమయంలోనే ఇరువురు కాసేపు వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమె ఆఫీస్‌కు వచ్చారు. ఆ సమయంలో గార్డు ఆమె వద్దకు వెళ్లి తన గురించి ఫిర్యాదు చేయవద్దని బతిమాలాడు. అది వారి మధ్య వాగ్వాదానికి దారి తీసిందని, అప్పుడు అతను ఆమెను కంప్యూటర్ కేబుల్‌తో ఉరివేసి ఉంటాడని భావిస్తున్నారు.

బెంగళూరు వారితో నిత్యం టచ్‌లో..

బెంగళూరు వారితో నిత్యం టచ్‌లో..

ఆనంద్ కే రసిలా రాజు.. కేరళకు చెందిన అమ్మాయి. ఆమె సిస్టం ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆమె నిత్యం బెంగళూరు కార్యాలయంలోని సహోద్యోగులతో నిత్యం టచ్‌లో ఉంటారు. బెంగళూరులోని ఓ ఉద్యోగి ఆమెకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించారు. కాని స్పందన లేదు.

 రాత్రి తొమ్మిది గంటలకు..

రాత్రి తొమ్మిది గంటలకు..

రాత్రి తొమ్మిది గంటలకు ఆమె తొమ్మిదో అంతస్తులోని కాన్ఫరెన్సు హాలులో తన కుర్చీకి సమీపంలో పడి ఉండటాన్ని గార్డు చూశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా గార్డును అదుపులోకి తీసుకున్నారు.

పారిపోతుండగా..

పారిపోతుండగా..

అనుమానితుడైన సెక్యూరిటీ గార్డు సైకియా షిఫ్ట్ సాయంత్రం ఆరున్నర గంటలకు అయిపోయింది. ఎప్పటిలాగేఅతను తన డ్యూటీ అయిపోగానే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక తన బ్యాగేజీని సర్దుకొని.. పారిపోయే ఉధ్దేశ్యంలో భాగంగా ముంబై చేరుకున్నాడు. కానీ పోలీసులు అతనిని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో అదుపులోకి తీసుకొని, తిరిగి పుణే తీసుకు వచ్చారు.

English summary
25-year-old K Rasila Raju, a techie working with Infosys in Pune, was in office on Sunday, her day off, for a special project. At night, she would be found murdered in a conference room, strangled by a computer cable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X