వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓడిన రమ్య లక్కీ!: ఎమ్మెల్సీగా ఛాన్స్, బెంగళూరు షిప్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇటీవల సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తరఫున మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూసిన ప్రముఖ కన్నడ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్యను శాసన మండలికి పంపించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో మాండ్య నుండి పోటీ చేసిన ఈ 31 ఏళ్ల రమ్య అలియాస్ దివ్య స్పందన 5,518 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఆమె రాజకీయ షో ఇంతటితో ముగిసిపోలేదని చెప్పవచ్చు.

కర్నాటకలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది. వచ్చే నెలలో ఆమెను శాసన మండలికి నామినేట్ చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

 రమ్య

రమ్య

నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా ఆమె ఓటమి చవి చూశారు. 2013 ఉప ఎన్నికల్లో ఎవరి పైన రమ్య గెలిచారో ఆయన చేతిలోనే స్వల్ప మెజార్టీతో ఓటమి చవి చూశారు.

రమ్య

రమ్య

రమ్య ప్రముఖ నటి కావడంతో పాటు ఆమెకు అంబరీష్, ఎస్ఎం కృష్ణ వంటి పలువురు ప్రముఖులు మాండ్యలో ప్రచారం చేశారు. మాండ్యలో ఆమె గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఓటమి పాలయ్యారు.

రమ్య

రమ్య

నటుడు, మంత్రి అంబరీష్ పైన రమ్య చేసిన వ్యాఖ్యలు ఆమెకు కొంత నష్టం చేశాయి. అంబరీష్ అభిమానులు రమ్యకు మద్దతుగా నిలబడలేదని భావిస్తున్నరు.

రమ్య

రమ్య

ఎన్నికల్లో ఓడిపోయిన రమ్య మాండ్యలో తాను ఉంటున్న నివాసాన్ని ఖాళీ చేశారు. ఆమె కర్నాటక రాజధాని బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు.

రమ్య

రమ్య

మాండ్య లోకసభ నియోజకవర్గం నుండి రమ్య ఓటమికి అంబరీష్ కారణమని ఆమె మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మాండ్యలో అంబరీష్‌ను తప్పుపడుతూ పోస్టర్ కూడా వెలిసింది.

రమ్య

రమ్య

సార్వత్రిక ఎన్నికల్లో రమ్యకు 5,18,852 ఓట్లు రాగా, జనతా దళ్(ఎస్) నుండి గెలుపొందిన పుట్టరాజుకు 5,24,370 ఓట్లు వచ్చాయి. కేవలం ఐదు వేలకు పై చిలుకు ఓట్లతోనే ఆమె ఓడారు.

రమ్య

రమ్య

కర్నాటకలో కాంగ్రెసు పార్టీకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆమెను శాసన మండలికి పంపించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Kannada film actress Ramya, 31, who failed in her attempt to be elected to the Lok Sabha from the Mandya constituency on a Congress ticket by a narrow margin of 5,518 votes, could be politically rehabilitated by the party with a nomination next month to the state legislative council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X