శబరిమల రూట్ ఎంట్రీ టైమింగ్స్ లో భారీ మార్పులు
శబరిమల సన్నిధానానికి వెళ్లే సత్రం - పుల్మేడు మార్గంలో అయ్యప్ప స్వాముల ప్రవేశ సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పంబలోని సత్రం నుంటి సన్నిధానం వెళ్లే ఈ మార్గంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. ఇదివరకు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతి ఉండేది. అయ్యప్ప స్వాములు ఆలస్యంగా సన్నిధానం చేరుకుంటోండటం, ఈ మార్గంలో వన్యప్రాణులతో కలిగే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు అయ్యప్ప స్వాములు సన్నిధానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతోందని అధికారులు గుర్తించారు. దీనికి తోడు- రాత్రి వేళల్లో ఈ మార్గంలో వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండటంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. సన్నిధానానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే కనుమ మార్గంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినప్పటికీ, అర్ధరాత్రి వరకు స్వాములు ఆ ప్రాంతానికి చేరుకోలేకపోతున్నారు.

ఇది ప్రమాదకరమని పెరియార్ టైగర్ రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇడుక్కి జిల్లా కలెక్టర్ డాక్టర్ దినేషన్ చెరువత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతర మార్గాల సమయాల్లో కూడా మార్పులు జరిగాయి. అళుతక్కడవు నుండి ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, ముక్కుళి నుండి ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. సత్రం మార్గం గుండా శబరిమల నుండి తిరిగి వచ్చే భక్తులను ఉదయం 8 నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అనుమతిస్తారు.
ఇటీవల పుల్మేడు మార్గంలో ఓ భక్తుడిపై అటవీ ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. ఏనుగులు, పులులు, అడవి దున్నలు వంటి అనేక వన్యప్రాణులకు ఈ సాంప్రదాయ తీర్థయాత్ర మార్గం నివాస స్థలం. ఈ వన్యప్రాణుల సంచారం దృష్ట్యా భక్తులకు భద్రత కల్పించడానికి అటవీ శాఖ అధికారులు మార్గం పొడవునా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు నిర్దేశించిన మార్గం నుండి పచ్చిక బయళ్లలోకి లేదా అడవుల్లోకి వెళ్లేందుకు అనుమతించరు.
పశ్చిమ కనుమల స్వచ్ఛమైన గాలి, పచ్చదనం మధ్య అయ్యప్ప సన్నిధికి సాగే ఈ పవిత్ర యాత్ర ప్రతి భక్తుడినీ పులకరింపజేస్తుంది. సత్రం-పుల్మేడు మార్గంలో సాగే ఈ యాత్ర భక్తులకు మర్చిపోలేని అనుభూతిని ఇస్తుంది. పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా అయ్యప్ప స్వామిని తలచుకుంటూ ముందుకు సాగే భక్తులకు అటవీ శాఖ, పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది అడుగడుగునా తోడుగా ఉంటూ భద్రత కల్పిస్తున్నారు. సీతకుళం, జీరో పాయింట్, పుల్మేడు, ఉరక్కుళి వంటివి ఈ మార్గంలో ఉన్న రెస్ట్ పాయింట్స్.
ఇక్కడ వేడి గంజి, పప్పు, టీ, అల్పాహారం ఉచితంగా అందిస్తారు. అత్యవసర వైద్య సహాయం కోసం ఆఫ్ రోడ్ అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. సత్రంలోని చెక్ పాయింట్ నుండి అనుమతించిన భక్తుల సంఖ్య, టోకెన్ నంబర్లను సరిపోల్చి, మార్గంలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు తమ విధులు ముగిస్తారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications