భర్త నిద్రిస్తుండగా మర్మాంగం కోసేసిన భార్య!
వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చు రేపడమే కాకుండా, అత్యంత దారుణమైన నేరానికి దారితీసింది. తనను కాదని వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో ఓ భార్య తన భర్త మర్మాంగాన్ని కత్తితో కోసేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సంచలనం సృష్టించింది.
అసలేం జరిగిందంటే?
అస్సాం రాష్ట్రానికి చెందిన బిదాన్ (33) కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం తమిళనాడులోని కోయంబత్తూరుకు వలస వచ్చాడు. అత్తిపాళయంలోని ఒక నివాస సముదాయంలో ప్లంబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య జిండి (36), ఒక కుమార్తె ఉన్నారు. వారు అస్సాంలోనే ఉండగా.. బిదాన్ మాత్రం కోయంబత్తూరులో ఒంటరిగా నివసిస్తున్నాడు.

కోయంబత్తూరులో ఉంటున్న తన భర్త వేరే యువతితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని జిండికి అనుమానం కలిగింది. దీంతో ఆమె అస్సాం నుంచి కోయంబత్తూరుకు వచ్చి తన భర్తను నిలదీసింది. అయితే తనకు ఎవరితోనూ సంబంధం లేదని బిదాన్ ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అనుమానం తీరని జిండి, భర్తపై నిఘా ఉంచేందుకు అక్కడే ఉండిపోయింది. రోజూ భర్తతో కలిసి పనికి కూడా వెళ్లేది.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని..
4 రోజుల క్రితం ఒకరోజు జిండి పనికి వెళ్లిన సమయంలో, బిదాన్ తన ఇంటికి ఓ మహిళను తీసుకువచ్చాడు. అనుకోకుండా ఇంటికి వచ్చిన జిండి, వారిద్దరినీ అభ్యంతరకర రీతిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. దీంతో ఆమె ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ తర్వాత బిదాన్ మద్యం తాగి గాఢ నిద్రలో ఉన్న సమయంలో, జిండి కత్తితో అతని మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం ఆ భాగాన్ని ఇంటి బయట పడేసింది.
పరిస్థితి విషమం
బిదాన్ నొప్పితో పెట్టిన కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని, అతడిని రక్తపు మడుగులో చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బిదాన్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిండిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications