వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎక్స్ ఎంపీ కార్డుల కోసం దరఖాస్తు... రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న ఆ ఇద్దరు?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : బీజేపీతో పాటు ఎన్డీఏ 1 సర్కారులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు మహిళా నేతలు రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్ రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఇద్దరు మహిళా నేతలు ఎక్స్ ఎంపీ (మాజీ పార్లమెంటు సభ్యులు) ఐడీ కార్డుల కోసం అప్లై చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. 17వ లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారు పార్లమెంటుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి అప్లికేషన్లు పరిశీలించిన అనంతరం కేంద్రం వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనుంది.

ఒకదేశం ఒకేసారి ఎన్నికలపై అఖిలపక్షం.. భేటీకి కేసీఆర్, మమత, స్టాలిన్ డుమ్మా..ఒకదేశం ఒకేసారి ఎన్నికలపై అఖిలపక్షం.. భేటీకి కేసీఆర్, మమత, స్టాలిన్ డుమ్మా..

రాజకీయాలకు శాశ్వత విరామం?

రాజకీయాలకు శాశ్వత విరామం?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుష్మా స్వరాజ్‌తో పాటు సుమిత్రా మహజన్ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బరి నుంచి తప్పుకుంటున్నట్లు సుష్మా అప్పట్లో ప్రకటించారు. సుమిత్రా మహజన్ పోటీకి ఆసక్తి చూపినా వయోభారం కారణంగా ఆమెకు టికెట్ ఇచ్చే విషయంలో బీజేపీ తర్జనభర్జనలు పడింది. ఈ క్రమంలో సుమిత్రా స్వయంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు సుమిత్రా మహజన్ విందు ఇవ్వనుండటం ఆమె రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నారన్న వాదనలకు మరింత బలం చేకూర్చుతోంది.

ఇండోర్ నుంచి ఎనిమిదిసార్లు ఎంపీ

ఇండోర్ నుంచి ఎనిమిదిసార్లు ఎంపీ

బీజేపీ సీనియర్ నేత అయిన సుమిత్రా మహజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు. ఈసారి కూడా ఇండోర్ టికెట్ ఆశించినా బీజేపీ అధిష్టానం సుముఖత చూపలేదు. 75ఏళ్లు పైబడిన నేతలకు టికెట్ ఇవ్వకూడదని బీజేపీ అధిష్టానం నిర్ణయించడమే ఇందుకు కారణం. దీంతో
హైకమాండ్ సందిగ్దంలో ఉండటంతో 76 ఏళ్ల సుమిత్రా మహజన్ స్వయంగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

 ఢిల్లీ సీఎంగా పనిచేసిన సుష్మా

ఢిల్లీ సీఎంగా పనిచేసిన సుష్మా

ఇక సుష్మా స్వరాజ్ సైతం మధ్యప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విదిశా ఎంపీగా ఎన్నికైన ఆమె ఎన్డీఏ 1లో విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో సుష్మా ఢిల్లీ సీఎంగానూ పనిచేశారు. అనారోగ్యం కారణంగా ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న సుష్మాను రాజ్యసభకు పంపాలని బీజేపీ హైకమాండ్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కేంద్రం అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ మాజీ పార్లమెంటు సభ్యురాలి కార్డుకు దరఖాస్తు చేయడం చర్చనీయాంశంగా మారింది.

English summary
Two veteran BJP woman stalwarts, former external affairs minister Sushma Swaraj and former Lok Sabha speaker Sumitra Mahajan, signalled the end of their legislative careerson Tuesday when the former applied for and the latter secured ex-member of Parliament identity cards
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X