• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్, కిల్లర్ వీరప్పన్ శిష్యుల కేసు: కోర్టు సంచలన తీర్పు, సాక్షాలు!

|

చెన్నై: స్యాండిల్ వుడ్ రారాజు, కన్నడ కంఠీరవుడు, దివంగత డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో ఇంత కాలం ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మందికి మంగళవారం కేసు నుంచి మోక్షం లంభించింది. గంధపు చెక్కల స్మగ్లర్, కిల్లర్ వీరప్పనతో కలిసి డాకర్ట్ రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరి మీద ఎలాంటి సాక్షాలు రుజువు కాకపోవడంతో మంగళవారం కోర్టు కేసు కొట్టివేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ కేసు విచారణ తమిళనాడులోని గోపిచెట్టిపాళ్యం అడిషనల్ మెజిస్టేట్ కోర్టులో విచారణ జరిగింది మంగళవారం ఇరువురి వాదనలు పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మణి 9 మంది మీద నేరం రుజువు కాలేదని, వారిని విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

విఫలం అయ్యారు

విఫలం అయ్యారు

డాక్టర్ రాజ్ కుమార్ ను వీరు కిడ్నాప్ చేశారని బలమైన సాక్షాలు కోర్టు ముందు సమర్పించడంలో ప్రాషిక్యూషన్ విఫలం అయ్యింది, వీరే రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశరాని సాక్షం లేదని, డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు సైతం ఇంతకాలం జరిగిన విచారణకు హాజరుకాలేదని న్యాయమూర్తి మణి గుర్తు చేశారు.

వీరప్పన్ శిష్యులు

వీరప్పన్ శిష్యులు

డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన 9 మందిని వెంటనే విడుదల చెయ్యాలని న్యాయమూర్తి మణి ఆదేశాలు జారీ చేశారు. రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశారని నమోదు అయిన కేసులో వీరప్పన్ తో పాటు సెంథిల్ కుమార్ గోవిందన్. చంద్రేగౌడ, మాలు, మారన్, గోవిందరాజ్ అలియాస్ ఇనియన్, అందిల్ అలియాస్ ఏళుమలై, సెల్వన్ అలియాస్ సత్యా, అమృతలింగం, పాసువన్, నాగరాజ్, పుట్టస్వామి, కలమందిరం, రమేష్ పేర్లు ఉన్నాయి. రమేష్ అచూకి ఇంత వరకూ పోలీసులు గుర్తించలేకపోయారు.

18 ఏళ్ల కిత్రం పక్కాప్లాన్

18 ఏళ్ల కిత్రం పక్కాప్లాన్

తలవాడి పోలీసులు డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్ కేసు నమోదు చేసి నరహంతకుడు, కిల్లర్ వీరప్పన్ తో సహ 14 మంది మీద కేసులు నమోదు చేశారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని ఈరోడ్ జిల్లాలోని దోడ్డ గాజూరు ప్రాంతంలో 2000 సంవత్సరం జులై 30వ తేదీ డాక్టర్ రాజ్ కుమార్ తో సహ ముగ్గురిని కిల్లర్ విరప్పన్, అతని అనుచరులు కిడ్నాప్ చేశారు. ఆ సందర్బంలో కర్ణాటకలో తమిళ సోదరులపై దాడులు జరిగాయి.

రూ. వేల కోట్లు ఆఫర్

రూ. వేల కోట్లు ఆఫర్

తమిళనాడు, కర్ణాటకలో ఆందోళనలు తారస్థాయికి చేరుకున్నాయి. రాజ్ కుమార్ ను విడుదల చేయించడానికి రెండు రాష్రాల ప్రభుత్వాలు విఫలయత్నం చేశాయి. వేల కోట్ల రూపాయలు ఇచ్చి రాజ్ కుమార్ ను క్షేమంగా విడుదల చేయించడానికి కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు సిద్దం అయ్యారు.

ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్

తమిళ పత్రిక నక్కిరన్ ఎడిటర్ నక్కిరన్ గోపాలన్ తో చర్చలు జరిపిన వీరప్పన్ చివరికి 2008 నవంబర్ నెలలో 108 రోజుల పాటు రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసి తన అధీనంలో పెట్టుకున్న డాక్టర్ రాజ్ కుమార్ ను క్షేమంగా విడిచిపెట్టాడు. 2004 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీ తమిళనాడు టాస్క్ పోర్స్ పోలీసు చీఫ్ కే. విజయకుమార్, ఎన్ కే. శాంతమరై కన్నన్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్ కౌంటర్ లో విరప్పన్, అతని అనుచరులు అంతం అయ్యారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
All nine accused in Sandalwood matinee idol Dr. Rajkumar's abduction case were acquitted by Tamil Nadu's Goibichettipalayam additional magistrate court on Tuesday. Additional Magistrate Mani said that the prosecution has failed to prove its charges against the accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more