వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ పండితుడు నెల్లాయ్ కన్నాన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

తమిళ పండితుడు నెల్లాయ్ కన్నాన్‌ను పెరంబలూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాపై కన్నాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు మెరీనా బీచ్‌లో ఆందోళన చేపట్టడం, బీజేపీ శ్రేణులు ఫిర్యాదులు చేయడంతో.. తమిళనాడు సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.

బీజేపీ నేతల ఆందోళన..

బీజేపీ నేతల ఆందోళన..

మెరీనా బీచ్‌లో గల గాంధీ విగ్రహాం వద్ద బీజేపీ నేతలు పొన్ రాధాకృష్ణన్, సీపీ రాధాకృష్ణన్, ఎల్ గణేశన్, హెచ్ రాజా ఆందోళన చేపట్టారు. మోడీ, అమిత్ షాపై అనుచిత వ్యాఖలు చేసిన కన్నాన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మోడీ, అమిత్ షాపై కామెంట్లకు సంబంధించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు బీజేపీ శ్రేణులు కూడా ఆందోళనలు చేపట్టాయి. తమిళనాడులో చాలా పోలీసు స్టేషన్లలో కన్నాన్‌పై ఫిర్యాదు కూడా చేశారు. దాదాపు 15కి పైగా కేసులు కూడా నమోదయ్యాయి.

ఎందుకు హతమార్చొద్దంటూ..

ఎందుకు హతమార్చొద్దంటూ..

ఇటీవల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కన్నాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను ముస్లింలు ఎందుకు చంపొద్దు అని అడిగారు. ప్రధాని మోడీ కీలక నిర్ణయాల వెనక మాస్టర్ మైండ్ అమిత్ షా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ తప్పనిసరి ముస్లింల చేత శిక్షింపబడతారని తెలిపారు. ఇప్పటివరకు జరగలేదు, కానీ జరిగే అవకాశం ఉందన్నారు.

పళని, పన్నీర్‌పై కూడా

పళని, పన్నీర్‌పై కూడా

మోడీ, అమిత్ షాపైనే కాకుండా.. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.. ఇతర నేతలపై కూడా కన్నాన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోడీ, షాపై కామెంట్లకు సంబంధించి బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చి, ఆందోళనలు ఉధృతం అవడంతో కన్నాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

థాంక్స్..

థాంక్స్..


కన్నాన్ అరెస్టయ్యేందుకు పోరాడిన బీజేపీ నేతలు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ధన్యవాదాలు తెలిపారు. పోలీసు స్టేషన్లలో కంప్లైంట్ చేసి, ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
tamil Scholar Nellai Kannan has been arrested in Perambalur for making controversial remarks on PM Narendra Modi and Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X