లెక్కలతో సహా ప్రధాని నరేంద్ర మోడీకి తేజస్వి యాదవ్ కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్‌లో టాయిలెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చారు. చంపారన్‌ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల ముగింపు సంర్భంగా మంగళవారం మోడీ బీహార్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. బీహార్‌ ప్రభుత్వం వారం రోజుల్లో 8.5లక్షల మరుగు దొడ్లను నిర్మించిందని ప్రశంసించారు.

వారం రోజుల్లో బీహార్‌ ప్రభుత్వం 8.5లక్షల మరుగుదొడ్లను నిర్మించిందని, అంత వేగంగా నిర్మించడం సాధ్యమైన విషయం కాదని, ఈ వేగంతో వెళితే బీహార్‌ జాతీయ సరాసరిని తొందర్లోనే అందుకోగలదని మోడీ అన్నారు.

 Tejashwi Yadav does the math for PM Narendra Modi

తేజస్వి యాదవ్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. వారంలో 8.5లక్షల మరుగుదొడ్లను నిర్మించారంటే నిమిషానికి 84 మరుగుదొడ్లను నిర్మించారని అర్థమని, వాటన్నింటిని ఓ లెక్క రూపంలో వివరించారు. ఇదో పెద్ద అంకెల గారడీ అన్నారు.

అంత వేగంతో మరుగుదొడ్లను నిర్మించడం మానవ మాత్రులకు సాధ్యం కాదన్నారు. బీహార్‌లో స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం అమలు చాలా మందకొడిగా సాగుతోందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
RJD leader Tejashwi Yadav took a dig at Prime Minister Narendra Modi for the latter allegedly messing up his arithmetic.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X