వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మందుల కోసం ఎగబడుతున్న జనం.. అసలేం జరుగుతోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా

చైనా గతవారం కోవిడ్-19 నిబంధనలు సడలించిన తర్వాత మందులు కొరతను ఎదుర్కొంటోంది.

మార్కెట్‌లో ఐబూప్రోఫెన్, కోల్డ్ మెడిసిన్స్, కోవిడ్-19 టెస్టింగ్ కిట్‌ల కొరత ఉందని వార్తలు వ్యాపించడంతో ప్రజలు కొనడానికి షాపులకు పరుగులు పెడుతున్నారు.

నిమ్మకాయలు, విటమిన్-సి పుష్కలంగా ఉన్న క్యాన్డ్ పీచెస్, ఎలక్ట్రోలైజ్డ్ వాటర్‌తో సహా హోమ్ రెమెడీస్ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో చాలా వరకు అందుబాటులో లేవు.

హోర్డింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణ సమస్యే కావచ్చు, కానీ, లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ఇక్కడ ఇలా జరగడం ఇదే తొలిసారి. కోవిడ్-19 నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు చైనాలో లేదా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ కొరత ఉన్న అవుట్‌లెట్ల ఫోటోలు, పోస్టులు చేయడం మామాలే.

ఇపుడు చైనా నిబంధనలు సడలించింది. కరోనా స్వీయ పరీక్షలు, వ్యక్తిగత ఐసోలేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది. అయితే చలి గాలుల నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురై విపరీతంగా మందులు కొంటున్నారు.

https://twitter.com/SCMPNews/status/1602966638071980033

స్థానిక ప్రభుత్వాలు తమ ఐసీయూ యూనిట్లను అప్‌గ్రేడ్ చేయాలని, వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా నెలాఖరులోగా ఫీవర్ క్లినిక్‌లను తెరవాలని చైనా ప్రభుత్వం కోరింది.

ఆరోగ్య వ్యవస్థ అతలాకుతలం కాబోతోందని ఇప్పటికే సంకేతాలు అందాయి. క్లినిక్‌లు నిండిపోవడంతో.. రోగులు రోడ్లపై కారులో సెలైన్ బాటిళ్లు పెట్టుకుని కనిపించిన ఓ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

నొప్పి నివారిణులు, విటమిన్, జలుబు మందుల డిమాండ్ రోజురోజుకు ఎలా పెరిగిపోతుందో చైనా డైలీ తన కథనంలో వివరించింది.

పీచ్ ఉత్పత్తులు

కొన్ని మీడియా సంస్థలు ఖాళీ ఫార్మసీ ర్యాక్‌ల ఫొటోలు ప్రచురించాయి.

ఈ డిమాండ్‌ను ఎదుర్కోవడానికి ఫార్మాస్యూటికల్ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై మీడియా గత వారం రోజులుగా కథనాలు ప్రసారం చేస్తోంది.

భయాందోళనల నేపథ్యంలో కొనుగోళ్లు పెరిగిపోయాయని చైనా డైలీ వార్తా పత్రిక కథనం తెలిపింది. గ్వాంగ్‌జౌ నగరంలో కొనుగోళ్లు కాస్త అప్రమత్తంగా జరపాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.

వాటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇటీవల అత్యధిక సంఖ్యలో వైరస్‌ కేసులు నమోదైన నగరంగా గ్వాంగ్‌జౌ నిలిచింది.

కరోనా నిబంధనల నేపథ్యంలో డిటెక్షన్ కిట్‌ల టర్నోవర్ 300 శాతం పెరిగిందని గ్లోబల్ టైమ్స్ వార్తా పత్రిక తన కథనంలో పేర్కొంది.

జెడీ హెల్త్ వంటి ప్రముఖ ప్లాట్ ఫాంలలో కూడా కిట్‌లు త్వరగా అయిపోయాయని తెలిపింది.

''విటమిన్ సి'' కి డిమాండ్ ఎందుకు పెరిగింది?

"వినియోగదారుల నుంచి విటమిన్ సి కి డిమాండ్ విపరీతంగా పెరిగింది" అని ది పేపర్ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.

కొన్ని షాపింగ్ కేంద్రాల్లో నిమ్మకాయలు ఇప్పటికే అమ్ముడుపోయాయని తెలిపింది. నిమ్మ రుచి గల టీ, స్వీట్లు, వాటర్ తదితరాలు అమ్ముడుపోయాయని ఆ కథనంలో రాసింది.

టిన్డ్ పీచెస్ (నారింజ రంగులో ఉండే ఒక రకమైన పండు) పరిస్థితి కూడా ఇలాగే ఉందని చైనా డైలీ కథనంలో పేర్కొంది.

వాటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం, ఎక్కువకాలం నిల్వ ఉండటం కారణంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో వాటిని ఎక్కువగా కొంటున్నారని తెలిపింది.

కొన్ని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫాంలలో క్యాన్డ్ ఎల్లో పీచ్‌లకు కూడా డిమాండ్ బాగా పెరుగుతోంది. తరుచుగా నో స్టాక్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయని ఆ వార్తాపత్రిక పేర్కొంది.

వాటి ద్వారా కోవిడ్ -19 లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆన్‌లైన్‌లో వదంతులు వ్యాపించాయని సినా న్యూస్ తెలిపింది.

అయితే విటమిన్ సి అధికంగా తీసుకోవద్దని ప్రజలను కొందరు వైద్యులు మీడియాలో హెచ్చరించారు. పీచ్‌లను ఎక్కువగా తింటే దగ్గు తీవ్రం అవుతుందని మరికొందరు హెచ్చరించారు.

పలు రకాల చికిత్సలు తీసుకోవాలంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం విపరీతంగా జరిగింది కూడా.

జ్వరం లేదా చెమట పట్టినపుడు ఎలక్ట్రోలైట్ వాటర్ హైడ్రేషన్‌కు సాయం చేస్తుందని ప్రచారం జరిగింది. దీంతో ఆ నీటిని కొనడానికి ప్రజలు పరుగులు తీస్తుండటం పియర్ వీడియోలో కనిపించింది.

ఇక మరోవైపు ఆల్కాహాల్ తీసుకుంటే వైరస్‌ను చంపవచ్చు లేదా అరికట్టవచ్చని వదంతులు కూడా వ్యాపించాయని గ్లోబల్ టైమ్స్ కథనం పేర్కొంది.

అలా చేస్తే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని ప్రజలను హెచ్చరించింది కూడా.

వైద్యులు ఏమంటున్నారు?

ప్రజలు గుడ్డిగా మందులు కొనడం, పలు రకాల మందులు కలపడం, అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడంపై వైద్యులు హెచ్చరికలు జారీ చేసినట్లు వార్త పత్రికలు వెల్లడించాయి.

కోవిడ్-19 థెరపీల నాణ్యత, భద్రత, సరఫరాను నిర్ధారించాలని ఔషధ సంబంధిత కంపెనీలను చైనా ఫుడ్ అండ్ డ్రింక్ అడ్మినిస్ట్రేషన్ కోరింది.

ఔషధాల ఉత్పత్తి, సరఫరాపై పటిష్టమైన పర్యవేక్షణకు ఆదేశాలు జారీచేసింది.

సరైన వైద్య ప్రమాణాలు లేని కోవిడ్-19 థెరపీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవద్దని మార్కెట్ పర్యవేక్షణ అధికారులు వినియోగదారులను హెచ్చరిస్తున్నారు.

నకిలీ మందులు కొనుగోలు చేయకుండా సరైన మార్గాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు సలహాలు ఇచ్చారు.

అయితే, ఆరోగ్యం బాగాలేని పేషెంట్ల పరిస్థితి మరింత క్షీణించకుండా ఉండేందుకు ఈ హెల్త్ కిట్‌లు ఏర్పాటు చేస్తున్నామని అవుట్‌లెట్‌లు అంటున్నాయి.

వ్యూహాన్‌లో వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మందులు, యాంటిజెన్ పరీక్షలు, గొంతు సిరప్‌ల ప్యాక్‌లను అందిస్తున్నారని చైనా డైలీ తన కథనంలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The people who are flying for medicine in China.. What is really happening?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X