ప్రముఖ నటి లైంగిక దాడి కేసు: కోయంబత్తూరులో విచారణ, అక్కడే వీడియో మెమొరీ కార్డు ?

Posted By:
Subscribe to Oneindia Telugu

కొచ్చి/చెన్నై: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, అతని స్నేహితుడు విగ్నేష్ ను తమిళనాడులోకి కోయంబత్తూరుకు తీసుకువచ్చిన కేరళ పోలీసులు అక్కడ విచారణ చేస్తున్నారు.

నటి లైంగిక దాడి కేసు: జైల్లో మలయాళం హీరో లగ్జరీ లైఫ్, సెల్ లో లేడంట, అధికారులతో !

ప్రముఖ నటిని కిడ్నాప్ చేసిన నిందితులు కారులోనే రెండు గంటల పాటు ఆమె మీద లైంగిక దాడి చేశారని, ఆ సందర్బంలో మొబైల్ లో వీడియో తీశారని కేరళ పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే మొబైల్ లో వీడియో తీసిన పల్సర్ సునీ ఆ మొబైల్ లోని మెమోరీ కార్డు మాయం చేశాడు.

The two main accused in the actress case in Coimbatore

అంతే కాకుండా లైంగిక దాడి జరిగే సమయంలో మొబైల్ లో వీడియోతో పాటు ఫోటోలు తీశారని బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో సాక్షాలు సేకరించడానికి కేరళ పోలీసులు నిందితులు పల్సర్ సునీ, విగ్నేష్ ను తమిళనాడులోని కోయంబత్తూరుకు తీసుకు వచ్చి విచారణ చేశారు.

నటి లైంగిక దాడి కేసు: మలయాళం హీరో దిలీప్ జ్యుడిషియల్ కస్టడీ పొడగింపు, ఇక అంతే !

ప్రముఖ నటి మీద లైకంగిక దాడి చేసిన సమయంలో మొబైల్ లో వీడియో తీసిన మెమొరీ కార్డు ప్రముఖ మలయాళం నటుడు దిలీప్ భార్య, ప్రముఖ నటి కావ్య మాధవన్ కు చెందిన లక్షా షోరూంలో ఇచ్చానని పల్సర్ సునీ మొదట పోలీసులకు చెప్పాడు. అయితే ఇప్పటి వరకూ ఆ మెమొరీ కార్డు పోలీసులకు చిక్కలేదు. మెమొరీ కార్డు కోయంబత్తూరులో దాచి పెట్టారని కేరళ పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ విచారణ చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The two main accused in the actress case, Sunil Kumar and Vigeesh, were brought to Coimbatore, Tamil Nadu for evidence collection. The incident reportedly took place when the actress was returning from a shoot.
Please Wait while comments are loading...