
ఉద్దవ్ థాకరేకు మరో షాక్.. షిండే వర్గంలో చేరిన 66 మంది కార్పొరేటర్లు
శివసేన అధినేత ఉద్దవ్ థాకరే క్రమంగా పార్టీ పట్టు కోల్పోతున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు చేజారిన సంగతి తెలిసిందే. ఇక మిగిలి ఉంది మిగతా నేతలు, ఇతర పాలక వర్గాలు.. ఆయా చోట్ల కార్పొరేటర్లు. అయితే థానేలో కార్పొరేటర్లు కూడా చేయి జారిపోయారు. ఉద్దవ్ థాకరేకు హ్యాండ్ ఇచ్చి.. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇదీ థాకరేకు షాక్ కలిగించింది.
మాజీ మేయర్ నరేష్ ముస్కే సారథ్యంలో కార్పొరేటర్లు షిండేను నందనవన్‌లో గల అధికారిక నివాసంలో కలిశారు. వీరు షిండే వర్గంలో చేరినట్టు అయ్యింది. ఇదీ ఉద్దవ్ వర్గానికి పెద్ద షాక్ కలిగించే అంశమే.

షిండే శివసేన పక్ష నేతగా స్పీకర్ నార్వేకర్ గుర్తించారు. గొగవాలేను శివసేన చీఫ్ విప్‌గా ఎన్నిక చేశారు. అయితే 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్దవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ 16 మందిపై అనర్హత వేటు వేసినా.. షిండే ప్రభుత్వానికి సానుకూలంగా మారింది. ఎందుకంటే పూర్తి మెజార్టీ ఆ ప్రభుత్వానికి ఉంది.
గత నెల 20వ తేదీన షిండే తిరుగుబాటు ఎగరవేశారు. రోజు రోజుకు ఆయన మద్దతు పెరిగింది. అలా 39 మందికి చేరింది. చివరి క్షణంలో మరో ఎమ్మెల్యే చేశారు. గవర్నర్ ఆదేశాల మేరకు సభలో మెజార్టీ నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఉద్దవ్ థాకరేకు ఆదేశాలు జారీచేసింది. దాంతో ఆయన తన సీఎం పదవీకి రాజీనామా చేశారు. ఆ మరునాడు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. షిండేను సీఎంగా, దేవేంద్ర ఫడ్నవీస్‌ను డిప్యూటీగా ఎంపిక చేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం సజావుగా సాగుతుంది. షిండే బలాన్ని కూడా నిరూపించుకున్నారు. ఇంతలో అతనికి కార్పొరేటర్ల రూపంలో మద్దతు కూడా లభిస్తోంది.