• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రౌడీగారి పోలీస్ పెళ్లాం.. ఈ పెళ్లి కథేంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

నోయిడా : ప్రేమకు తరతమ భేదం లేదు. కుల,మతాల పట్టింపులు అసలే లేవు. వారి మనసులు కలిసేందుకు ఏదో ఒకటి దోహదం చేస్తుంది. రాజుని పనిమనిషి ప్రేమించొచ్చు. రాణిని సైనికుడు ఇష్టపడొచ్చు. విభిన్న ప్రేమకథలు చరిత్రగా మనముందు ఉన్నాయి. వెరైటీ ప్రేమకథలను సినిమాల్లో చూస్తుంటాం. కానీ సమాజంలో అలాంటి ప్రేమకథలు అరుదు. ముఖ్యంగా మహిళ పోలీసు అధికారి నేరస్తులను ప్రేమించడం .. పెళ్లి చేసుకోవడం ఉండవు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో సినిమా సీన్లను తలపించే యదార్థ ఘటన ఒకట జరిగింది.

నేరస్తుడి ప్రేమలో ..

నేరస్తుడి ప్రేమలో ..

ప్రేమ ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా పుడుతుందో తెలియదు. అందుకోసమే ప్రేమ గురించి కవులు విభిన్న రకాలుగా పోల్చారు. యూపీకి చెందిన పాయల్ అనే పోలీసు అధికారి కూడా కరడుగట్టిన గ్యాంగ్‌స్టార్ రాహుల్ థారసన ప్రేమలో పడింది. అతనిని ఆమె కలిసిన చోట కూడా విభిన్నమనే చెప్పాల్సి ఉంటుంది. నేరస్తులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే చోట రాహుల్‌ను తొలిసారి చూశారు పాయల్. ఇంకేముంది అతనికి తనకు తెలియకుండానే మనసు ఇచ్చేసింది. తర్వాత అతను జైలులో ఉన్న లేదా బయట ఉన్నా వారి మనసులు మరింత దగ్గర చేశాయి. వీరి ప్రేమ బాషలు అత్యంత సన్నిహితంగా మెలిగేవారికి కూడా తెలియకపోవడం విశేషం.

కోర్టు కలిపింది వారిద్దరినీ ..

కోర్టు కలిపింది వారిద్దరినీ ..

మన్మోహన్ గోయల్ అనే వ్యాపారి హత్య కేసులో నిందితుడు రాహుల్. 2014 మే 9న అతని రాహుల్ అండ్ కో మట్టుబెట్టింది. ఈ కేసులో రాహుల్ పోలీసులకు చిక్కాడు. దీంతో వారు అతనిని సూర్జాపూర్ కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో పాయల్ మొదటిసారి చూసింది. అప్పుడు వారి చూపులు కలిశాయి. మాట్లాడటం, మనసు ఇచ్చి పుచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే అతను ఏదైనా నేరం చేసి జైలులో ఉన్న.. లేదా బయట ఉన్న పాయల్‌తో మాత్రం మాట్లాడుతూనే ఉంటారు. ఈ క్రమంలో ఇటీవల రాహుల్, పాయల్‌లో పెళ్లిచేసుకున్నాడు. అత్యంత గోప్యంగా వీరి వివాహం జరిగింది. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాహుల్ షేర్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది. గ్యాంగ్‌స్టర్‌ను పోలీసు అధికారి పెళ్లి చేసుకుందని సమాజానికి తెలిసిపోయింది.

తప్పుపడుతున్న ఖాకీలు

తప్పుపడుతున్న ఖాకీలు

ఓ గ్యాంగ్‌స్టర్‌ను పాయల్ వివాహం చేసుకోవడంతో పోలీసుశాఖలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరప్రవృత్తి కలిగిన వారిని వివాహం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు పెళ్లి జరిగే సమయంలో గౌతమ్ బుద్ధ్‌నగర్ పోలీసుస్టేషన్‌ పరిధిలో పనిచేస్తున్నారని .. ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేస్తున్నారో తెలియడం లేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఆమె వివాహంపై ఆరాతీస్తామని .. ఖైదీని పెళ్లిచేసుకోవడంపై వివరణ అడుతామని నోయిడా రూరల్ ఎస్పీ రన్‌విజయ్ సింగ్ పేర్కొన్నారు.

ఎవరీ రాహుల్

ఎవరీ రాహుల్

రాహుల్ సాధారణ నేరస్తుడేం కాదు. కరడగుట్టిన గ్యాంగ్‌స్టార్. అనిల్ దుజానా గ్యాంగ్‌లో పనిచేస్తుంటాడు. పోలీసు రికార్డుల ప్రకారం 2008 నుంచి ఇతని నేరచరిత్ర ప్రారంభమైంది. 2017లో అక్రమంగా ఆయుధాలు సఫ్లై చేసిన కేసులో అరెస్టై .. జైలు నుంచి తప్పించుకున్నాడు. కానీ తర్వాత అతనే పోలీసులకు లొంగిపోయాడు. నోయిడాలో వ్యాపారి మన్మోహన్ గోయల్ హత్యకేసు సందర్భంగా రాహుల్‌ను పాయల్ కలిశారు. అంతకుముందు కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. హత్య, దోపిడీకి సంబంధించిన పదుల సంఖ్య కేసుల్లో రాహుల్ నిందితుడిగా ఉన్నారు. అలాంటి కరడుగట్టిన నేరస్తుడిని పాయల్ పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించారు. అయితే దీనిని పోలీసు ఉన్నతాధికారులు తప్పుపడుతున్నారు.

English summary
Payal, the cop, first met Rahul Tharasana (30), the gangster, at a court where his case was being heard. Rahul was accused of murdering a trader named Manmohan Goyal. He was arrested on May 9, 2014. Reports say besides this, he is also an accused in over a dozen cases of loot and murder. In a report, the Times of India said Payal met Rahul at the Surajpur court for the first time. She was posted there at that time. The report says according to police sources Payal remained in touch with Rahul "even as he continued to be in and out of jail". Over the years their love story flourished and recently Rahul reportedly shared photographs where he and Payal are dressed up as bride and groom in a mandap. It was from their wedding, which apparently took place at an undisclosed location, TOI says in its report. The date of the wedding is not known.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X