ప్రియా కన్నుగీటితే పీఎం అయినా!.., తెగ సిగ్గుపడ్డ రాహుల్

Subscribe to Oneindia Telugu
  Priya Prakash Warrier memes and Spoofs

  హైదరాబాద్: ప్రియా వారియర్.. పేరుకు తగ్గట్టే కుర్రకారు గుండెలపై పెద్ద వార్ ప్రకటించింది. కను సైగలతో ఆమె పలికించిన హావభావాలు యువతను పిచ్చి పిచ్చిగా ఫిదా చేశాయి. ప్రియా చూపులు నేరుగా తమ గుండెల్లోనే గుచ్చుకున్నట్టు ఫీలైపోతున్నారు యువత.

  ఇంతలా మాయ చేసిన ప్రియా వారియర్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ హాట్ టాపిక్. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. అంతా ఆమె గురించే చర్చ. ఈ నేపథ్యంలో స్పూఫ్ వీడియోలు కూడా చాలానే బయలుదేరాయి. రాజకీయాల నాయకులకు ప్రియా సైట్ కొడుతున్నట్టుగా క్రియేట్ చేసిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

  షాకింగ్ : యువతని పిచ్చెక్కించిన ప్రియా వారియర్ పై కేసు నమోదు..చిక్కుల్లో మలయాళి పిల్ల!

  రాహుల్ గాంధీపై స్పూఫ్ వీడియో:

  రాహుల్ గాంధీపై స్పూఫ్ వీడియో:

  ప్రియా వారియర్ స్పూఫ్ వీడియోల్లో అన్నింటికంటే హైలైట్ రాహుల్ వీడియోనే అని చెప్పాలి. ప్రియా కన్ను గీటితే.. ముసిముసి నవ్వులతో లోలోపలే సంబరపడుతున్నట్టుగా కనిపిస్తున్న ఆ వీడియో నెటిజెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  ప్రియా కన్ను గీటితే పీఎం అయినా..:

  ప్రధానమంత్రి మోడీని కూడా వదల్లేదు నెటిజెన్స్. ప్రియా కన్నుగీటితే.. పీఎం అయినా సరే వయసు మరిచిపోవాల్సిందే అన్నట్టుగా వీడియోను రూపొందించారు. ప్రియా సైట్ కొట్టగానే.. మోడీ చిన్నగా నవ్వుతూ మురిసిపోయిన వీడియో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తోంది.

  ఫన్నీ ట్రంప్:

  ఫన్నీ ట్రంప్:

  ఇక అసలే స్త్రీ లోలుడిగా ముద్రపడ్డ ట్రంప్ ను సైతం ఈ స్పూఫ్ వీడియోల్లోకి లాగేశారు. ట్రంప్ ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ కు.. ప్రియా వారియర్ కను సైగల వీడియోను జతచేసి యూట్యూబ్ లో వదిలారు. ఈ వీడియో కూడా నెటిజెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

  'ఒరు ఆదర్ లవ్':

  టీనేజ్ లవ్ నేపథ్యంగా తెరకెక్కుతున్న మలయాళ చిత్రం ‘ఒరు ఆదర్ లవ్' పాటతో ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ అపోయారు. పాట సంగతి మర్చిపోయారు గానీ.. ఆమె కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్ యువత గుండెల్లో గట్టిగానే గుచ్చుకున్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కూడా యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Malayalam actress Priya Prakash Varrier’s wink has become the first viral sensation to come out of India in 2018.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి