వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ యడ్యూరప్ప?: గుమస్తాగా ప్రస్థానం మొదలుపెట్టి, 23వ సీఎంగా ప్రమాణం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Unknown Facts about Political Carrier Of Yeddyurappa

బెంగళూరు: సాధారణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మొదలైన బీఎస్ యడ్యూరప్ప రాజకీయ జీవితం మూడవ సారి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే స్థాయికి చేరుకుంది. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.

2007లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటికీ ఆయన కేవలం ఏడు రోజులు మాత్రమే పదవిలో కొనసాగారు. జేడీఎస్ అధికారాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

2008లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప మూడేళ్ల 62రోజులపాటు పదవిలో కొనసాగారు. అక్రమ మైనింగ్ ఆరోపణలు రావడంతో మరోసారి ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 బీఎస్ యడ్యూరప్ప పూర్తి పేరు

బీఎస్ యడ్యూరప్ప పూర్తి పేరు

యడ్యూరప్ప పూర్తి పేరు బూకనకిరి సిద్ధలింగప్ప యడ్యూరప్ప. ఈయన ఫిబ్రవరి 23, 1943లో మాండ్య జిల్లా కేఆర్ పేట్ తాలూకాలోని బూకనకిరిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సిద్ధలింగప్ప, పుట్టతాయమ్మ. తమకూరు జిల్లాలోని యెడియూర్ వద్ద సిద్ధలింగేశ్వర అని స్వామిజీ నిర్మించిన శివ ఆలయంలోని దేవుడి పేరును యడ్యూరప్పకు పెట్టారు.

గుమస్తాగా ప్రారంభమైన జీవితం

గుమస్తాగా ప్రారంభమైన జీవితం

యడ్యూరప్ప తల్లి ఆయనకు నాలుగేళ్లు ఉండగానే చనిపోయింది. మాండ్యాలోని పీఈఎస్ కాలేజీలో యడ్యూరప్ప తన ప్రీ యూనివర్సిటీ కాలేజీ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో గుమస్తాగా చేరారు. ఆ తర్వాత ఆ జాబ్ వదిలేసి షికారిపురలో వీరభద్ర శాస్త్రికి చెందిన శంకర్ రైస్ మిల్లులో గుమస్తాగా చేరారు.

 యజమాని కూతురితో వివాహం

యజమాని కూతురితో వివాహం

ఆ రైస్ మిల్ యజమాని కూతురైన మైత్రిదేవిని 1967లో యడ్యూరప్ప వివాహమాడారు. ఆ తర్వాత శివమొగ్గలో ఓ హార్డ్‌వేర్ షాప్ ఏర్పాటు చేశారు. యడ్యూరప్పకు ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర, ముగ్గురు కూతర్లు అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి ఉన్నారు. 2004లో యడ్యూరప్ప భార్య నీళ్ల సంపులో పడి మృతి చెందారు.

కాలేజీ రోజుల్లోనే.. అంచెలంచెలుగా

కాలేజీ రోజుల్లోనే.. అంచెలంచెలుగా

కాగా, కాలేజీ రోజుల్లోనే యడ్యూరప్ప ఆర్ఎస్ఎస్‌తో అనుబంధాన్ని పెంచుకున్నారు. 1970లో షికారిపుర యూనిట్‌కి కార్యవాహ(సెక్రటరీ)గా నియమితులయ్యారు. 1972లో షికారిపుర మున్సిపాలిటీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనసంఘ్ తాలూకా ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 1975లో షికారిపుర టౌన్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా యడ్యూరప్ప ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో ఈయన బళ్లారీ, షిమోగాలోని జైళ్లలో ఖైదు అయ్యారు. ఆ తర్వాత 1985లో షిమోగా జిల్లా బీజేపీ అధ్యక్షులయ్యారు. 1988లో బీజేపీ కర్ణాటక అధ్యక్షులయ్యారు.

తొలిసారి 1983లో..

తొలిసారి 1983లో..

1983లో తొలిసారి కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు యడ్యూరప్ప. 1983 నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1999 ఎన్నికల్లో ఓటమిపాలైన యడ్యూరప్ప ఎమ్మెల్సీగా నామినేటయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అప్పుడు సీఎంగా ధరమ్ సింగ్ ఉన్నారు.

డిప్యూటీ సీఎంగా..

డిప్యూటీ సీఎంగా..

ధరమ్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి జేడీఎస్ నేత కుమారస్వామి తమ మద్దతును ఉపసంహరించుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొదటి 20నెలలు కుమారస్వామి సీఎంగా ఉంటారని, ఆ తర్వాత బీజేపీ నుంచి యడ్యూరప్ప సీఎం అవుతారని ఒప్పందం కుదుర్చుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంలో యడ్యూరప్ప డిప్యూటీ సీఎంతోపాటు ఆర్థిక మంత్రిగా కొనసాగారు.

మాజీ సీఎంపై విజయం

మాజీ సీఎంపై విజయం


అక్టోబర్ 2007లో బీజేపీ నుంచి యడ్యూరప్ప సీఎం కావాల్సి ఉండగా, అందుకు కుమారస్వామి నిరాకరించారు. దీంతో అక్టోబర్ 5న మంత్రివర్గం నుంచి వైదొలగిని బీజేపీ, కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతును ఉపసహరించుకుంది. 2008లో షికారిపుర నుంచి మాజీ సీఎం, ఎస్పీ నేత బంగారప్పపై యడ్యూరప్ప పోటీ చేసి గెలుపొందారు. బంగారప్పకు కాంగ్రెస్ మద్దతు తెలిపినప్పటికీ 45వేల ఓట్ల మెజార్టీతో యడ్యూరప్ప గెలవడం గమనార్హం.

 సొంతంగా పార్టీ పెట్టి..

సొంతంగా పార్టీ పెట్టి..


మే 30, 2008లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారంటూ యడ్యూరప్పపై లోకాయుక్త విచారణ జరపడంతో.. బీజేపీ అధిష్టానం ఒత్తిడి మేరకు ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత నవంబర్ 30, 2012లో కర్ణాటక జనతా పక్ష పార్టీని యడ్యూరప్ప ప్రకటించారు.

మళ్లీ బీజేపీలోకి..

మళ్లీ బీజేపీలోకి..

అయితే, నవంబర్, 2013లో ఎలాంటి షరతులు లేకుండా తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2014, జనవరి 2న తన పార్టీని బీజేపీలో కలిపేశారు. ఆ తర్వాత 2014లో షిమోగ నుంచి లోకసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 3లక్షల మెజార్టీతో గెలుపొందారు. తాజాగా, జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంలో యడ్యూరప్ప కీలక పాత్ర పోషించారు. గురువారం ఆయన కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

English summary
B S Yeddyurappa will take oath as the 23rd Chief Minister of Karnataka. Incidentally he is taking oath as the CM for the third time. In 2007, he was sworn as the CM, but the government lasted only 7 days as the JD(S) refused to transfer power.
Read in English: Who is B S Yeddyurappa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X