వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా వక్ర బుద్ధి, డోక్లామ్ లో మళ్లీ.., ఏం చేస్తోందో తెలుసా?

డోక్లామ్ లో ఏర్పడిన వివాదం సమసి నెలరోజులైనా కాకముందే మళ్లీ చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది. డోక్లామ్ లో వివాదాస్పద ప్రాంతానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో మరో రోడ్డు విస్తరణ పనులకు పూనుకుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా.. చైనా తన బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. డోక్లామ్ లో ఏర్పడిన వివాదం సమసి నెలరోజులైనా కాకముందే మళ్లీ తన వక్ర బుద్ధిని చాటుకుంది.

డోక్లామ్ లో వివాదాస్పద ప్రాంతానికి సరిగ్గా 10 కిలోమీటర్ల దూరంలో మరో రోడ్డు విస్తరణ పనులకు పూనుకుంది. డోక్లామ్.. భూటాన్ దేశానికి చెందిన ప్రాంతం. కానీ ఆ ప్రాంతం తమ దేశం పరిధిలోకి వస్తుందనేది చైనా అడ్డగోలు వాదన.

china-doklam-raod

ఆమధ్య ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి చైనా ప్రయత్నించగా, భారత సైన్యం అడ్డుపడింది. డోక్లామ్ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణం జరిపితే భారత్ కు భద్రతా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

ఫలితంగా చైనా ప్రయత్నానికి భారత్ ససేమిరా అంది. దీంతో ఇరు దేశాల నడుమ సుమారు 70 రోజులపాటు ప్రతిష్టంభన నెలకొనగా, చివరికి ఒక ఒప్పందం అనంతరం రెండు దేశాల సైన్యం డోక్లామ్ ప్రాంతం నుంచి నెలరోజుల క్రితమే వైదొలగాయి.

తాజాగా వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో చైనా మరో రోడ్డు నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తోంది. డోక్లామ్ ప్రాంతంలో గతంలో రోడ్డు నిర్మాణం కోసం తీసుకొచ్చిన సామగ్రినే ఇప్పుడు తాజా రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తోంది.

దాదాపు 500 మంది చైనా సైనికులు చైనా రోడ్డు నిర్మిస్తున్న ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. చైనా మరోసారి.. డోక్లామ్ తన భూభాగంలోనిదే అని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Almost a month after India and China said to have turned down the aggressive standoff at the Sikkim border, the Chinese troops are reportedly back with the road construction plans. According to reports with more than 500 soldiers on guard, China is expanding a road on the Doklam Plateau barely 10 kilometers away from the location where the last conflict had occurred.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X