షాక్: మాజీ ప్రియుడిని కొత్త ప్రియుడితో చంపించింది

ముంబై: మాజీ ప్రియుడిని హత్య చేయించింది ప్రియురాలు. మాజీ ప్రియుడి ఒత్తిడిని తట్టుకోలేక కొత్త ప్రియుడితో మాజీ ప్రియుడిని హత్య చేయించింది. ఈ ఘటన మహరాష్ట్రలో చోటు చేసుకొంది.

Recommended Video

    వివాహిత దారుణ హత్య: గదిలో కండోమ్స్ Woman was lost life in her own house | Oneindia Telugu

    మహరాష్ట్రకు చెందిన సుమారి యాదవ్ తన మాజీ ప్రియుడిని హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగు చూశాయి. మాజీ కొత్త ప్రియుడితో మాజీ ప్రియుడిని హత్య చేయించేందుకు సుమారి యాదవ్ చేసిన ఫోన్ సంభాషణ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

    తొలుత యాక్సిడెంట్‌గా ఈ ఘటనను అంతా భావించారు. కానీ ఈ ఘటనపై సీసీటీవి పుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ జరిపితే అసలు విషయాలు వెలుగు చూశాయి.

    మాజీ ప్రియుడిని చంపించిన ప్రియురాలు

    మాజీ ప్రియుడిని చంపించిన ప్రియురాలు

    మహరాష్ట్రలోని థానేలో సుమారి యాదవ్ కు రాంజీ శర్మకు మధ్య ప్రేమాయణం సాగింది. ఇద్దరు కొంత కాలంపాటు సహజీవనం సాగించారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. ఈ విభేధాల కారణంగా మూడేళ్ళ నుండి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే కొత్త ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని సుమారి యాదవ్ చంపించింది.

    కొత్త ప్రియుడితో సహజీవనం

    కొత్త ప్రియుడితో సహజీవనం

    కొత్త ప్రియుడితో సుమారీ యాదవ్ సహ జీవనం సాగిస్తోంది. 35 ఏళ్ళ జయప్రకాష్ చౌహన్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. నాలుగు నెలల నుండి మాజీ ప్రియుడు రాంజీ శర్మ డబ్బుల కోసం సుమారి యాదవ్ ను వేధిస్తుండడడంతో పాటు ఇతర కారణాలతో అతడ్ని హత్య చేయించాలని సుమారి యాదవ్ ప్లాన్ చేసింది.

    యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్

    యాక్సిడెంట్ చేసి చంపాలని ప్లాన్

    యాక్సిడెంట్ చేసి చంపాలని సుమారి యాదవ్ ప్లాన్ చేసింది. రాంజీ శర్మకు మార్నింగ్ వాకింగ్ కు వెళ్ళే అలవాటు ఉంది. నవంబర్ 18న, శర్మ మార్నింగ్ వాక్ నుండి తిరిగి వస్తున్న సమయంలోనే చౌహన్ ను అత్యంత వేగంగా కారుతో ఢీకొట్టి హత్య చేశారు.కారును సర్వీసింగ్ చేయించి యాక్సిడెంట్ అయినట్టు నమ్మించారు.కొన్నాళ్ళపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకొన్నారు.

     సీసీటీవి పుటేజీ ఆధారంగా దర్యాప్తు

    సీసీటీవి పుటేజీ ఆధారంగా దర్యాప్తు

    సీసీటీవి పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. సీసీటీవి పుటేజీ ఆధారంగా ఉద్దేశ్యపూర్వకంగానే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు అనుమానించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+