భారీ భూకంపం: 6.2 తీవ్రతతో ప్రకంపనలు..సునామీ ముప్పు ఉందా?
అమెరికాలోని ఒరెగాన్ తీర ప్రాంతంలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు సంస్థ వెల్లడించింది. యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటెడ్ (UTC) ప్రకారం ఉదయం 3:25 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటుచేసుకోగా, ఒరెగాన్ రాష్ట్రంలోని బాండన్ నగరానికి పశ్చిమాన సుమారు 295 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
నష్టం వివరాలు..
భూకంపం అనంతరం ఇప్పటివరకు పోర్ట్‌ల్యాండ్ సహా ప్రధాన నగరాల్లో ఎటువంటి ప్రాణ నష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. తీరప్రాంతాలకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప ప్రకంపనలు అనుభవించారని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితిని అత్యవసర సేవా బృందాలు, భూకంప నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

సునామీ భయం లేదని స్పష్టం..
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపానికి సంబంధించి ఎటువంటి సునామీ హెచ్చరికను జారీ చేయలేదు. సోషల్ మీడియా వేదిక X (గతంలో ట్విట్టర్)లో కూడా అనేక మంది ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఒక నెటిజన్, “ఎటువంటి పెద్ద నష్టం లేదు, సునామీ ముప్పు కూడా లేదు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు” అంటూ ట్వీట్ చేశారు. మరో వ్యక్తి, “బలంగా అనిపించినా, సునామీ వచ్చే అవకాశం లేదు” అని వ్యాఖ్యానించారు.
భూకంపం చోటుచేసుకున్న ప్రాంతం
నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ భూకంపం బ్లాంకో ఫ్రాక్చర్ జోన్లో, పసిఫిక్ ప్లేట్ మరియు జువాన్ డి ఫుకా ప్లేట్ల మధ్య ఉన్న ట్రాన్స్‌ఫార్మ్ బౌండరీపై సంభవించింది. ఇది అత్యంత ప్రమాదకరంగా భావించే కాస్కాడియా సబ్డక్షన్ జోన్‌కు సంబంధం లేకపోవడం వల్లే భారీ నష్టం, సునామీ ప్రమాదం తప్పిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటిష్ కొలంబియాకు చెందిన ఒక భూకంప పరిశోధకుడు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
GFZ ఈ భూకంప తీవ్రతను 6.2గా నమోదు చేయగా, USGS మాత్రం దీనిని 6.0 తీవ్రతగా ప్రకటించింది. ఇలాంటి స్వల్ప తేడాలు భూకంపాల కొలతల్లో సాధారణమేనని నిపుణులు చెబుతున్నారు. USGS అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆఫ్టర్‌షాక్స్ సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
నిపుణులు మాత్రం కాలిఫోర్నియా, ఒరెగాన్ తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచిస్తున్నారు. ఈ భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉండగా, అధికార సంస్థలు పరిస్థితిని క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు తెలిపాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications