పెరూలో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

Posted By:
Subscribe to Oneindia Telugu

లిమా: పెరూలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైందని అధికారులు ప్రకటించారు. సునామీ కూడ వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పుక్వియో నగరానికి 124 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు ప్రకటించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశారు.

7.3 quake off Peru reported

ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపం వచ్చిన 300 కి.మీ పరిధి వరకు మాత్రమే సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రకంపనలు వచ్చిన ప్రదేశానికి సమీపంలో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ సంభవించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు సునామీ హెచ్చరికను జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The U.S. Geological Survey is reporting an earthquake with a preliminary magnitude of 7.3 off Peru's coast. There have been no immediate reports of casualties or damage.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి