వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానయానం: ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటే ఏమిటి? ఆ విమానాలను ఖాళీగా ఎందుకు తిప్పుతుంటారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఖాళీగా తిరిగే విమానాలను ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటున్నారు

లోపల ఒక్క మనిషి కూడా లేకుండా ఒక విమానం ఖాళీగా ఎగురుతుందా?

ఒక ఫ్లైట్ ఎగరాలంటే పైలట్‌కు, ఇతర సిబ్బందికి జీతాలివ్వాలి, ఇంధనం కొనుగోలు చేయాలి. బోలెడంత ఖర్చు ఉంటుంది.

మరి అలాంటి పరిస్థితుల్లో, సరుకులు లేకుండా లేదంటే, ప్రయాణికులు లేకుండా కొన్ని విమానాలు ఎందుకు ప్రయాణాలు చేస్తుంటాయి?

ఖాళీ విమానం

నిజంగా ఇలా జరుగుతుందా?

కచ్చితంగా జరుగుతుంది. యూరప్‌లో ప్రతినెలా డజన్ల కొద్దీ విమానాలు ఖాళీగా ప్రయాణిస్తుంటాయి. కొన్ని వాటి సామర్ధ్యంలో 10శాతానికి కూడా చేరుకోవు. ఇలాంటి వాటిని ఘోస్ట్ ఫ్లైట్స్ అంటుంటారు.

గత కొన్నేళ్లుగా లాటిన్ అమెరికా లేదా కరీబియన్‌ ప్రాంతంలో ఇలాంటి 'ఘోస్ట్ ఫ్లైట్స్’ అనేకం ప్రయాణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి రావడం, ప్రయాణాలపై నిబంధనలు పెరగడంతో ఈ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రమైంది.

చాలా విమానాశ్రయాలు తమ టేకాఫ్, ల్యాండింగ్ స్లాట్‌లను మెయింటెయిన్ చేయాలంటే షెడ్యూల్ చేసిన విమానాల్లో 80% విమానాలను తిప్పాల్సి ఉంటుంది. 20% విమానాలకు క్యాన్సిల్ మార్జిన్ ఉంటుంది.

ఈ శాతాలలో విమానాలు తిరగకపోతే, సదరు విమానాశ్రయాలు తమ స్లాట్‌లు రద్దు చేయకుండా మేనేజ్ చేయడానికి ఎయిర్‌లైన్స్‌ సంస్థలు ఖాళీ విమానాలను నడపాల్సి ఉంటుంది. లేదంటే, మరుసటి సంవత్సరం అవి ఆ విమానాశ్రయాలలో 'బెస్ట్ కమర్షియల్స్ అవర్స్'ను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

లండన్‌లో ఉదయం 6 గంటలకు టేకాఫ్ కావడం, 8 లేదా 9 గంటలకు టేకాఫ్ కావడం ఎప్పుడూ ఒకటి కాదు.

అలాగే మాడ్రిడ్‌లో ఉదయం 1 గంటకు ల్యాండ్ కావడం, మధ్యాహ్నం 5 గంటలకు ల్యాండ్ కావడం కూడా ఒకేలా ఉండదు. మెట్రో మూసేసిన సమయంలో సిటీ సెంటర్‌తో కనెక్షన్ లేకపోతే ప్రయాణికులు ఇబ్బంది పడతారు.

అలాగే ఈ సమయాలలో ధర కూడా ఒకేలా ఉండదు.

ఎయిర్ పోర్ట్

"వాడుకోండి లేదా వదులుకోండి"

అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో అన్ని విమానాల రష్‌ను మేనేజ్ చేయడానికి యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన యూరోపియన్ కమిషన్ అండ్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ''స్లాట్ వాడుకోండి లేదా వదులుకోండి'' అనే నియమాన్ని వర్తింపజేస్తుంది.

"తమ స్లాట్‌లపై చారిత్రకంగా వస్తున్న హక్కులను కాపాడుకోవడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలు స్వచ్ఛందంగా నడిపే విమానాలనే ఘోస్ట్ ఫ్లైట్‌‌లు అని పిలుస్తున్నారు'' అని ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) దీనిని నిర్వచించింది.

ప్రభుత్వానికి, విమానాశ్రయాలకు అనుసంధానంగా ఈ సంస్థ ''ఘోస్ట్‌ఫ్లైట్స్‌లో టిక్కెట్లు అమ్మడం ఉండదు. అవి ప్రయాణికులనుగానీ, సరుకులను గానీ సరఫరా చేయవు. వీటి నుంచి ఎలాంటి ఆదాయం ఉండదు'' అని వెల్లడించింది.

ఘోస్ట్ ఫ్లైట్స్ వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని, అది ఒక అనవసరమైన, ఉపయోగపడని విధానమని చాలామంది అంటారు.

దీనికి బదులుగా ఎయిర్ పోర్ట్ స్లాట్‌లను సమన్వయంతో పంపిణీ చేయడం ద్వారా ఎయిర్‌లైన్స్ మధ్య పోటీ పెంచవచ్చని, తద్వారా ప్రయాణికులకు లాభం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

"ఈ విమానాల వల్ల ఆర్దికంగా ఎలాంటి ఉపయోగం లేదు. అంతేకాక, పర్యావరణపరంగా ఎంతో నష్టం కూడా. చాలా ఇంధనం వృథా అవుతుంది. వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతుంది''అని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ లాయర్స్ అధ్యక్షుడు డీగో ఆర్.గొంజాలెజ్ అన్నారు.

మెట్రో రైళ్లు, విమాన సర్వీసులు ఒకదానికొకటి సహకరించుకోవాల్సి ఉంటుంది

సంప్రదాయ విమానయాన సంస్థలు - చవక ధరల విమానయాన సంస్థలు

ఒక విమానాన్ని వాణిజ్యపరంగా చూడటం ఎంతో కీలకం.

''స్లాట్‌లను టైమ్ వారీగా, షిఫ్టుల వారీగా కేటాయిస్తారు. వాటిని ఉపయోగించకపోతే జరిమానా విధిస్తారు. తర్వాతి సంవత్సరం ఎయిర్‌పోర్ట్ అథారిటీ వాటిని మరో కంపెనీకి అప్పగిస్తుంది. దీనివల్ల విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటాను కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది" అని గొంజాలెజ్ చెప్పారు.

సంప్రదాయ విమానయాన సంస్థలకు, కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఎయిర్‌లైన్ సంస్థలకు మధ్య పోటీ ఉందని, అయితే, ఖాళీగా వెళ్లాల్సి వచ్చినా, నిబంధనలకు అనుగుణంగా నడుచుకునేలా తాము ప్రోత్సహిస్తామని వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్ లాయర్స్ వెల్లడించింది.

"మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించే విమానయాన సంస్థలు బెస్ట్‌ షెడ్యూళ్లతో నడుస్తుంటాయి. ఎందుకంటే అవి అత్యంత ఖరీదైనవి. సౌలభ్యం దృష్ట్యా అవి కీలకమైన సమయాలలో ఎయిర్‌పోర్టులకు చేరుకుంటాయి" అని గొంజాలెజ్ చెప్పారు.

స్లాట్‌ను కాపాడుకోవడానికి కొన్ని సంస్థలు ఖాళీ విమానాలను నడుపుతుంటాయి

''నిర్ణీత సమయంలో ఒక డామినెంట్ క్యారియర్‌ కు పోటీ లేకపోతే అది ధరలను తగ్గించదు'' అన్నారు గొంజాలెజ్

ఇలాంటి పరిస్థితుల కారణంగా స్లాట్‌లను మెయింటెయిన్ చేయడానికి కొన్ని విమానాలు తక్కువమంది ప్రయాణికులతో లేదంటే అసలు ప్రయాణికులే లేకుండా విమానాలు నడపాల్సి వస్తోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డైరక్టర్ విల్లీ వాల్ష్ అన్నారు.

''రెండు విమానాశ్రయాల మధ్య ఫ్లైట్లను నడిపే క్యారియర్, తాను సర్వీసును నడపలేనప్పుడు రెండు ఎయిర్ పోర్టుల నుంచి అనుమతి తీసుకోవాలి. లేదంటే విమానాలను నడిపి తీరాలి''అన్నారు వాల్ష్.

ఈ నిబంధనల నుంచి కొన్ని సౌలభ్యాలు కల్పించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి.

అయితే, ఇలాంటి ఖాళీ విమానాలను నడిపే బదులు, తక్కువ ధరలతో ప్రయాణికులను ఆకర్షించి ఆయా సర్వీసులను నడపడం మంచిదని ఈ పరిశ్రమకు చెందిన వారు చెబుతున్నారు. నిజంగా ఇది పరిగణించాల్సిన అంశమే.

ఎయిర్ పోర్ట్

పర్యావరణానికి చేటు

ఏరోనాటికల్ ఇండస్ట్రీలో ఉన్న ఇలాంటి నిబంధనలు పర్యావరణానికి కూడా చేటు కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలలో ఏవియేషన్ ఇండస్ట్రీ వాటా దాదాపు 2 శాతంగా ఉంది. మానవ కార్యకలాపాల కారణంగా గ్లోబల్ వార్మింగ్‌లో ఈ రంగం మొత్తం వాటా 3.5% శాతంగా ఉంది.

పైగా ఇది అభివృద్ధి చెందే రంగం. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ శాతాలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ప్రకారం, 2000 నుండి, ఈ ఉద్గారాలు 50% పెరిగాయి. పరిశ్రమ రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రతి సంవత్సరం 4% కంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంచనా.

గ్రీన్‌పీస్ ప్రకారం "యూరప్‌లో ఈ ఘోస్ట్ ఫ్లైట్ల కారణంగా ఏటా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు 14 లక్షల కార్ల నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలకు సమానం.

2050 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాలకు కట్టుబడి ఉన్నట్లు విమానయాన పరిశ్రమ ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘోస్ట్ ఫ్లైట్లను తగ్గించాల్సిన అవసరం మరింతగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Aviation: What are Ghostflights? Why are those planes turned around empty?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X