వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడేళ్లకు అదృశ్యమై 27 ఏళ్ళకు దొరికిన కొడుకు, 2 లక్షల ప్రకటనలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు కోసం లీ షుంజీ అనే వ్యక్తి 24 ఏళ్లపాటు చేసిన శ్రమకు ఫలితం దక్కింది. 24 ఏళ్ళ తర్వాత తప్పిపోయిన తన కొడుకు ఆచూకీని కనుగొన్నాడు. సినిమాల్లో చూపించే సన్నివేశాలను పోలినట్టుగానే తన కొడుకు కోసం నిరాశ చెందకుండా ఆ తండ్రి చేసిన ప్రయత్నం ఫలించింది.

యదార్ధ సంఘలనలకు, సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే కొన్ని ఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలు కూడ తీస్తారు. అయితే సినిమాల్లో పోలీన తరహ ఘటన ఒకటి చైనాలో చోటు చేసుకొంది.

24 ఏళ్ళ తర్వాత తప్పిపోయిన కొడుకును ఓ తండ్రి కలుసుకొన్నాడు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత తప్పిపోయిన కొడుకు అతడే అని నిర్దారించిన పోలీసులు ఆ తండ్రికి అతడిని అప్పగించారు.

24 ఏళ్ళ తర్వాత కొడుకు ఆచూకీ

24 ఏళ్ళ తర్వాత కొడుకు ఆచూకీ

24 ఏళ్ళ తర్వాత చైనాలో తప్పిపోయిన కొడుకు తిరిగి దొరకడంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. అయితే తన కొడుకు కోసం దేశమంతా ఆ తండ్రి నిరాశ చెందుకుండా ప్రయత్నం చేశాడు. దీంతో 24 ఏళ్ళ తర్వాత ఆయన కొడుకును చేరుకోగలిగాడు.

కొడుకు కోసం రెండు లక్షల ప్రకటనలు

కొడుకు కోసం రెండు లక్షల ప్రకటనలు

మూడేళ్ళ ప్రాయంలోనే లిలీ అదృశ్యం కావడంతో లీ షుంజీ కొడుకు కోసం దేశమంతా గాలించాడు. తన కొడుకు కోసం నిరాశ చెందకుండా ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంతో తన కొడుకుకు చెందిన ఫోటోతో పత్రికలు, మీడియాలో అడ్వర్‌టైజ్ మెంట్స్ ఇచ్చాడు. 1,80,000 ప్రకటనలు ఇచ్చాడు. ఈ ప్రకటనలతో పాటు తండ్రి విస్తృతంగా దేశమంతా పర్యటించాడు.తన వ్యాపారాన్ని కూడ మానేసి కొడుకు కోసం ఆయన దేశమంతా పర్యటించాడు.

లిలిని పెంచుకొన్న దంపతులు

లిలిని పెంచుకొన్న దంపతులు

మూడేళ్ళ వయస్సున్న లిలిని ఓ జంట పెంచుకొంది. చిన్నతనంలో తల్లిదండ్రులకు లిలిని అప్పగించేందుకు వారు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. లిలి గురించి సరైన సమాచారం ఆ దంపతులకు చేరలేదు. దీంతో వారిని తమ కొడుకుగానే పెంచుకొన్నారు.ఈ దంపతులే లిలిని ఆ తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.

డిఎన్ఏ టెస్ట్ తో తేలిన లిలి భవితవ్యం

డిఎన్ఏ టెస్ట్ తో తేలిన లిలి భవితవ్యం

తప్పిపోయిన పిల్లల డిఎన్ఏ వివరాలను పోలీసులు భద్రపరుస్తారు. ఈ రకంగానే లిలి డిఏన్ఏ వివరాలను కూడ పోలీసులు భద్రపర్చారు. అయితే చిన్నతనంలోనే లిలి తప్పిపోయినట్టుగా లిలి తండ్రి ఇచ్చిన ప్రకటనలతో లిలిని పెంచిన దంపతుల వద్దకు లిలి తండ్రి లీ షుంజీ చేరుకొన్నాడు. ఈ విషయమై లిలికి అతడి తండ్రి లీ షుంజీకి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఇద్దరి డిఎన్ఏ పోలికలు సరిపోయాయి. దీంతో లీ షుంజీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

English summary
A man in China lost his three-year-old son on August 8, 1994, and re-united with him after almost 24 years. According to Mail Online, the man re-united with his son after sending 1,80,000 missing person notices across China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X