వావ్.. కెనాల్‌లో కొట్టుకొస్తోన్న మూగజీవి, సాహసించి కాపాడిన కూలీ.. ఎక్కడంటే
ఈ రోజుల్లో అంతా స్వార్థమే. అందరూ సెల్పీషే.. ఏదో కొందరు మాత్రమే మంచి, మానవత్వం చూపిస్తుంటారు. సాటి మనుషులపై ప్రేమ, వాత్సల్యం చూపించొచ్చు. మరీ మూగజీవాలపై అదేనండి కుక్క, పిల్లిని పట్టించుకునే వారు ఉన్నారా..? ఇప్పటికీ ఉన్నారు.. కానీ కొందరే అలాంటి వారు కనిపిస్తుంటారు. అలాంటి ఘటన ఒక్కటి జరిగింది. కెనాల్‌లో కొట్టుకువస్తోన్న డాగ్‌ను ఒడిసిపట్టుకున్నారు. ఆ వివరాలు ఏంటో చుద్దాం. పదండి.

వరదలో కొట్టుకొస్తున్న శునకం..
ఘటన ఈక్వెడార్‌లో జరిగింది.. జేసీబీ డ్రైవర్, కూలీ మాత్రం చక్కటి పని చేశారు. వరదలో ఓ శునకం కొట్టుకువస్తోంది. వారు దానిని గమనించారు. ఇంకేముంది దాని కోసమే కాచుకొని కూర్చొన్నారు. అదీ రానే వచ్చింది. ఇంకేముంది.. జేసీబీతో మట్టి తీసే కొక్కెంలో కూలీ ఉన్నాడు. వరదనీటికి శునకం కొట్టుకురాగా.. దానిని పట్టుకున్నాడు. దీనిని ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది అదీ కాస్తా వైరల్ అవుతుంది.
ఇలా కాపాడారు..
కెనాల్‌లో ఆ శునకం ఎలా పడిందో తెలియదు.. కానీ నీటి ప్రవాహానికి మాత్రం కొట్టుకొని వస్తోంది. దానిని చూసిన కూలీ.. కాపాడాలని అనుకున్నాడు. ఆ నీటి ప్రవాహంలో కూడా దానిని కాపాడేందుకు సిద్దమయ్యాడు. అతనికి డ్రైవర్ మంచి సహకారం అందించాడు. ఇంకేముంది ఇద్దరు కలిసి శునకాన్ని కాపాడారు. ఆ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మంచి మానవత్వం కలిగిన వారు అని కొనియాడుతున్నారు. మిమ్మల్నీ కౌగిలించుకోవాలని ఉంది.. చక్కని పనిచేశారు అని ప్రశంసించారు. మనం ప్రకృతిని కాపాడితే.. అదీ మనలను కాపాడుతుంది అని చెప్పారు.

శభాష్..
అలా వారిద్దరూ చేసిన పని.. ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అందరు ప్రశంసిస్తున్నారు. చక్కటి పనిచేశారని.. మూగజీవాన్ని కాపాడి మంచి సందేశం ఇచ్చారని అంటున్నారు. ఇవాళ, రేపు ఎవరినీ పట్టించుకోవడం లేదు. సొంత పేరంట్స్‌ను కూడా పట్టించుకోని పరిస్థితి. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల మధ్య కూడా సఖ్యత ఉండటం లేదు. అలాంటిదీ ఓ మూగజీవం కోసం అతను పెద్ద సాహసమే చేశాడు. వారు చేసిన సాహసోపేత పనిని అందరూ కీర్తిస్తున్నారు. వావ్ అంటూ ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications