అమెరికా వీడి బయటకు వెళ్లొద్దు: ఉద్యోగులకు గూగుల్ హెచ్చరిక!
అమెరికా వీడి బయటకు వెళ్లొద్దని గూగుల్ తన ఉద్యోగులను హెచ్చరిస్తోంది. కొన్ని అమెరికా రాయబార కార్యాలయాలు మరియు కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్ లకు సంబంధించి జాప్యం జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు చేయవద్దని గూగుల్ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక అంతర్గత మెమో ద్వారా హెచ్చరించింది. ఒకవేళ ఎవరైనా అంతర్జాతీయ ప్రయాణాలు చేయవలసి వస్తే అమెరికా వెలుపల ఎక్కువకాలం చిక్కుకు పోయే ప్రమాదం ఉందని google హెచ్చరిస్తోంది.
అమెరికా వదిలి వెళ్ళకండి : గూగుల్ సూచన
ఆల్ఫాబెట్ కు చెందిన గూగుల్ తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించినట్టు ఓ ప్రముఖ వార్తాపత్రిక నివేదించింది. ఈ సూచన ముఖ్యంగా వీసా స్టాంప్ అవసరమయ్యే సిబ్బందికి వర్తిస్తుందని గూగుల్ పేర్కొంది. వీసా ప్రాసెసింగ్ సమయం బాగా పెరిగిన నేపథ్యంలో అమెరికా వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది.

అమెరికా వదిలి వెళితే మళ్ళీ ప్రవేశం కష్టం
దాదాపు 12 నెలల కాలం, అక్టోబర్ 2026వరకు హెచ్ 1బీ ఇంటర్వ్యూ లను వాయిదా వేస్తున్నట్టు, వెట్టింగ్ మొదలుపెట్టినట్టు ఇప్పటికే యూఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా విడిచి వెళితే తిరిగి ప్రవేశించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని google కు న్యాయ సలహాదారులు అయిన BAL ఇమిగ్రేషన్ లా పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నట్టు వెల్లడించింది.
ఇండియాలో వీసా అపాయింట్మెంట్స్ జాప్యం
అయితే అంతకుముందు సెప్టెంబర్ నెలలోనే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన ఉద్యోగులను అంతర్జాతీయ ప్రయాణాలను నివారించాలని సూచించింది. భారతదేశంలో వేలాదిమంది హెచ్1 బి వీసా దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా రద్దు చేయడం, వీసా అపాయింట్మెంట్ లలో జాప్యాలు, కఠినమైన పరిశీలన విధానాలు కలిసి విదేశీ నైపుణ్యం ఉన్న వారిలో అనిశ్చితిని పెంచుతున్నాయి.
వీసా స్టాంపింగ్ కోసం ఇప్పుడు వెళ్లొద్దు
ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, h1b వీసాదారుల దరఖాస్తుల పైన పరిశీలనను మరింత కఠినతరం చేసి తీసుకు వస్తున్న కొత్త మార్గదర్శకాలు, తదితర చర్యలు వెరసి యూఎస్ వదిలి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ వెళితే నెలల తరబడి బయటనే ఉండాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
-
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications