వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘నా ఒంటిపై దద్దుర్లు వచ్చాయి, ఇది మంకీపాక్సేనా’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
మంకీపాక్స్

దద్దుర్లు చాలా కారణాల వల్ల రావొచ్చు. అయితే, అరుదుగా వీటికి మంకీపాక్స్ వైరస్ కూడా కారణం కావొచ్చు.

అసలు మనకు ఆ వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడం ఎలా?

ఇది మంకీపాక్సేనా?

మొదట ఈ ప్రశ్న మీకు మీరే వేసుకోవాలి. ఆ వైరస్ సోకిన వారిని కలిశారా? ఈ వైరస్ సోకిన వ్యక్తితో ఎక్కువసేపు గడిపినప్పుడు, చర్మం-చర్మం తాకినప్పుడు ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువ.

ప్రస్తుతం చాలా కొద్దిమందికి మాత్రమే ఈ వైరస్ సోకింది. అంటే ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువ.

అయితే, ఆఫ్రికా దేశాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఈ కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. పిల్లలకు అరుదుగా ఈ వైరస్ సోకుతోంది.

మంకీపాక్స్ సోకితే మొదట ''ఫ్లూ’’ సోకిన లక్షణాలు మనకు కనిపిస్తాయి. బాగా అలసిపోతాం, జ్వరం కూడా వస్తుంది. దీన్ని ''ఇన్వేషన్ పీరియడ్’’గా వైద్యులు పిలుస్తున్నారు. ఈ సమయంలోనే మన శరీరంలోని కణాల్లోకి వైరస్ ప్రవేశిస్తుంది.

దీని వల్ల మన శరీరంలోని భిన్న ప్రాంతాల్లో గ్రంథులు కాస్త ఉబ్బుతాయి. అంటే ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు మన శరీరం ప్రయత్నిస్తోందన్నమాట.

ఆ తర్వాత దశలో దద్దుర్లు వస్తాయి. దద్దుర్లలోనూ దశలు ఉంటాయి. వీటిలో మొదటి దశలో చర్మం ఎర్రగా మారుతుంది. ఆ తర్వాత బొడెపెల్లా తయారవుతాయి. ఇవి చిదిగిపోయి పైచర్మం నల్లగా మారుతుంది.

''మచ్చలతో దద్దుర్లు మొదలవుతాయి. ఈ మచ్చలు ఎర్రగా కనిపిస్తాయి. నెమ్మదిగా ఇవి పెరుగుతాయి. అప్పుడే మనకు కాస్త దురద వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇవి బొడిపెల్లా మారతాయి’’అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎమర్జెన్సీస్ ప్రోగ్రామ్‌కు చెందిన డాక్టర్ రోస్మండ్ లూయిస్ బీబీసీతో చెప్పారు.

''ఆ బొడిపెలు నెమ్మదిగా పగిలిపోతాయి. వీటి నుంచి తెల్లని చీము బయటకు వస్తుంది. నెమ్మదిగా ఇవి ఎండిపోతాయి. ఆ ప్రాంతంలో నల్లని గొయ్యిలా మచ్చలు ఏర్పడతాయి’’అని లూయిస్ వివరించారు.

మంకీపాక్స్ దద్దుర్లు సాధారణంగా మొహంపై మొదట కనిపిస్తాయి. కొన్నిసార్లు నోటి లోపల కూడా ఉంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు, శరీరంలోని ఇతర భాగాలకు ఈ దద్దుర్లు విస్తరిస్తాయి.

తాజా కేసుల్లోని కొన్నింటిలో జననేంద్రియాల్లోనూ దద్దుర్లు వచ్చినట్లు గమనించామని డాక్టర్ లూయిస్ చెప్పారు. ''మొదట మనకు ఈ దద్దుర్లు కనిపించకపోవచ్చు’’అని ఆయన వివరించారు.

మిగతా శరీర భాగాలతో పోల్చినప్పుడు దద్దుర్లు వచ్చిన ప్రాంతం రంగు భిన్నంగా ఉంటుంది. దీని వల్ల బెడ్‌షీట్లు, బట్టలు పాడవుతాయి.

చర్మంలో అసాధారణ మార్పులు, జననేంద్రియ భాగాల్లో పుండ్లు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది.

''దద్దుర్లు ఇలానే వస్తాయని చెప్పడం చాలా కష్టం. ఇవి ఒక్కొక్కరిలో ఒక్కోలా మొదలుకావొచ్చు. అందుకే వైద్యుల సూచనలను చాలా జాగ్రత్తగా పాటించాలి’’అని బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్ ప్రెసిడెంట్ డా. తాన్య బ్లీకెర్ వివరించారు.

దద్దుర్లకు ఇంకా ఏమైనా కారణాలున్నాయా?

ఈ దద్దుర్లకు చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.

chickenpox

చికెన్‌పాక్స్

చికెన్‌పాక్స్ దద్దుర్ల నుంచి దురద ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా సాధారణ దద్దుర్లుగా మొదలై నల్లని మచ్చలుగా మారతాయి. జీవితంలో చాలా మందికి ఒకసారైనా చికెన్‌పాక్స్ వస్తుంటుంది. చిన్నప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత, పెద్దయిన తర్వాత మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. చికెన్‌పాక్స్ వైరస్ మళ్లీ క్రియాశీలం కావడాన్ని షింగెల్స్‌గా పిలుస్తారు. దీని వల్ల కూడా పుండ్లు, దురదలు వస్తాయి.

స్కాబీస్

దీన్నే గజ్జి అని కూడా పిలుస్తారు. కొన్నిరకాల కీటకాల వల్ల ఇది సంక్రమిస్తుంది. ఈ కీటకాలు మన శరీరంపై గుడ్లు పెడుతుంటాయి. ఇవి చాలా దురద పెడతాయి. శరీరంలో ఎక్కడైనా ఈ దద్దుర్లు రావొచ్చు.

సాధారణంగా వేళ్ల మధ్య భాగంలో ఈ దద్దుర్లు మొదలవుతాయి. మొదట చర్మం పగిలిపోవడాన్ని మనం గమనించొచ్చు. ఇది అంత తీవ్రమైన సమస్య కాకపోవచ్చు. కానీ, సరైన చికిత్స తీసుకోకపోతే, త్వరగా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది.

బెడ్‌బగ్స్

బెడ్‌బగ్స్

కొన్నిసార్లు బెడ్‌బగ్స్ కరవడం వల్ల కూడా దద్దుర్లు వస్తుంటాయి. ముఖ్యంగా పరుపులు, దుప్పట్లలో ఈ బెడ్‌బగ్స్ నివాసం ఉంటాయి. ఇవి చాలా చిన్న కీటకాలు. ఒక్కోసారి మన కంటికి నేరుగా ఇవి కనిపించకపోవచ్చు. ఇతర కీటకాలు కుట్టినప్పుడు వచ్చే దద్దుర్లలానే ఈ దద్దుర్లు కనిపిస్తాయి. అయితే, ఒకేచోట పుండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. దీన్నిబట్టి ఇవి బెడ్‌బగ్స్ దద్దుర్లుగా గుర్తించొచ్చు.

హెర్పిస్

సిఫిలిస్ లేదా హెర్పిస్

సిఫిలిస్ ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఇది మనకూ సోకుతుంది. జెనిటల్ హెర్పిస్ కూడా ఇలానే సోకుతుంది. ఈ రెండింటిలోనూ మొదట దద్దుర్లు వచ్చి పుండ్లుగా మారతాయి. ఇవి కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టాలి.

అలెర్జీ/యుటికేరియా

అలెర్జీ/యుటికేరియా

ఇవి కూడా కాస్త దురద పెట్టే దద్దుర్లే. దేనివల్ల అయినా హాని పొంచివుందని భావించినప్పుడు శరీరం స్పందించడం వల్ల ఈ దద్దుర్లు వస్తాయి. సాధారణంగా నాడీ స్పందనలే దీనికి కారణం అవుతుంటాయి. మనకు పడని ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు లేదా కొన్నిరకాల రసాయనాలు, ఔషధాలు, మొక్కలను ముట్టుకున్నప్పుడు కూడా ఈ దద్దుర్లు వస్తుంటాయి.

మొలిస్కమ్

మొలిస్కమ్

ఇది సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్. పిల్లల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. దీని వల్ల ఎలాంటి హాని ఉండదు. కానీ, ఇతర శరీర భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ దద్దుర్లు కూడా సమూహాలుగా కనిపిస్తాయి. మొదట ఎక్కువగా ఇవి చంకలు, గజ్జలు లేదా కీళ్ల సందుల్లో కనిపిస్తాయి. చర్మానికి చర్మం తగలడం వల్ల లేదా ఇన్ఫెక్షన్‌ సోకిన వ్యక్తుల దుప్పట్లు, టవల్స్ ముట్టుకున్నప్పుడు కూడా ఇది సోకుతుంది.

హ్యాండ్, ఫూట్, మౌత్ డిసీజ్

హ్యాండ్, ఫూట్, మౌత్ డిసీజ్

ఇది వైరల్ ఇన్ఫెక్షన్. దగ్గు, తుమ్ముల వల్ల ఇది వ్యాపిస్తుంది. వైరస్‌తో కలుషితమైన ఇంట్లోని వస్తువులను ముట్టుకున్నప్పుడు కూడా ఈ దద్దుర్లు వస్తుంటాయి. ఇవి మొదట నోటి చివర మొదలవుతాయి. ఆ తర్వాత అర చేతులు, కాళ్లపైకీ దద్దుర్లు విస్తరిస్తుంటాయి. రోజులు గడుస్తున్నకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుంది.

ఇంపెటైగో

ఇంపెటైగో

ఇవి చాలా వేగంగా వ్యాపించే బ్యాక్టీరియా వల్ల వచ్చే దద్దుర్లు. దెబ్బతిన్న చర్మం వల్ల ఈ బ్యాక్టీరియా సోకుతుంది. దీని వల్ల ఎర్రని దద్దుర్లు, పుండ్లు మొదలవుతాయి. ఇవి అంత తీవ్రంగా మారవు. యాంటీబయోటిక్ క్రీమ్‌లతో ఇవి తగ్గే అవకాశముంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
I have small bubbles on my skin, is it monkey pox
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X