• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జోబైడెన్ జీవితంలో భయానక విషాదం -జిల్ లేకుంటే ఏమయ్యేవారో! -‘ఫస్ట్ లేడీ’కి లవ్ ట్వీట్

|

'లూజర్.. ఫెయిల్యూర్.. నిరాశావాది..'.. ఇవి.. డెమోక్రాట్ అభ్యర్థి జోబైడెన్ ను ఉద్దేశంచి రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ విరివిగా ఉపయోగించిన పదాలు. 50 ఏళ్ల పొలిటికల్ కేరీర్ లో బైడెన్ ఏకంగా 47 భారీ వైఫల్యాలను మూటగట్టుకున్నారంటూ ట్రంప్ శిబిరం ప్రచారం చేసింది. పాలిటిక్స్ సంగతి పక్కనపెడితే.. వ్యక్తిగత జీవితంలో బైడెన్ నిజంగానే భయానక అనుభవాలు చవిచూశారు. కానీ రెండో భార్య జిల్ బైడెన్ సాయంతో ఆయన కుంగుబాటును, చీకటిని అధిగమించగలిగారు. ఇవాళ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి ముందు జోబైడెన్ తన జీవితంలో జిల్ నింపిన వెలుగును గుర్తుచేసుకున్నారు...

క్యాపిటల్ భవంతిలో లవ్ ట్వీట్

క్యాపిటల్ భవంతిలో లవ్ ట్వీట్

అమెరికా 46వ అధ్యక్షుడిగా జోబైడెన్, 49వ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ బుధవారం ప్రమాణ స్వీకారాలు చేశారు. క్యాపిటల్ భవంతిలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగిన కార్యక్రమంలో.. సుప్రీంకోర్టు జడ్జిలు ఈ ప్రమాణస్వీకారాలను చేయించారు. కాగా, పదవి చేపట్టడానికి కొద్ది నిమిషాల ముందు జోబైడెన్ తన ట్విటర్ ఖాతా నుంచి భార్య జిల్ బైడెన్ కు లవ్ మెసేజ్ పంపారు. అందులో..

 జిల్ తోనే వెలుగు..

జిల్ తోనే వెలుగు..

‘‘ఐ లవ్ యూ జిల్. జీవితంలో కొత్త అడుగు వేస్తోన్న సందర్భంలో నువ్వు నా వెంటే ఉన్నందుకు సదా కృతజ్ఞుడను''అని బైడెన్ రాసుకొచ్చారు. జో బైడెన్ భార్య జిల్ బైడెన్.. ఫిలడెల్ఫియా పల్లె ప్రాంతంలో పుట్టిపెరిగారు. స్వయంకృషితో ఎదిగిన కుటుంబం ఆమెది. కొన్నాళ్లు మోడలింగ్ చేసినా, తర్వాతి కాలంలో ఉన్నత విద్యపై దృష్టిపెట్టి, డాక్టరేట్ ను పూర్తి చేశారు. బోధనను వృత్తిగా ఎంచుకున్న జిల్.. ఒబామా హయాంలో(అప్పుడు జోబైడెన్ ఉపాధ్యక్షుడు) సెకండ్ లేడీ హోదాలో ఉంటూనే తన వృత్తిని కొనసాగించారు. అమెరికాలో విద్యా వ్యాప్తి, కమ్యూనిటీల బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. నిజానికి బైడెన్ జీవితంలోకి జిల్ రాక నాటకీయంగా జరిగిందిలా...

 బైడెన్ భార్య, కూతురు మృతి..

బైడెన్ భార్య, కూతురు మృతి..

అది 1972.. అమెరికా చరిత్రలోనే సెనేట్ కు ఎన్నికైన రెండో పిన్నవయస్కుడిగా 29 ఏళ్లకే జోబైడెన్ రికార్డు నెలకొల్పారు. ‘డెమోక్రటిక్ పార్టీ గోల్డెన్ బాయ్' అనే ఇమేజ్ ఉండేదప్పుడు. సెనేటర్ గా ప్రమాణం చేసేందుకు బైడెన్ వాషింగ్టన్ లో ఉండిపోగా, సొంతఊరు డెలావేర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన భార్య నీలియా, నెలల వయసున్న కూతురు నవోమీ మృతి చెందారు. ఆ యాక్సిడెంట్ లో బైడెన్ ఇద్దరు కొడుకులూ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న సమయంలోనే బైడెన్ కుటుంబం విఛ్చిన్నమైంది. ఆస్పత్రిలో కొడుకుల బెడ్ల పక్కనే నిలబడి బైడెన్ సెనేటర్ గా ప్రమాణం చేశారు...

శిథిలమైన జీవితంలో జిలుగులు..

శిథిలమైన జీవితంలో జిలుగులు..

ఆ పరిస్థితుల్లో పిల్లల్ని చూసుకుంటూ ప్రతిరోజూ డెలావేర్ నుంచి వాషింగ్టన్ కు రైల్లో ప్రయాణించేవాడు. మొదటి భార్య చనిపోయిన ఏడేళ్ల తర్వాత జిల్ రాకతో బైడెన్ జీవితం మళ్లీ గాడినపడింది. 1979లో స్కూల్ టీచర్ గా పనిచేస్తోన్న జిల్ ను బైడెన్ వివాహం చేసుకున్నారు. వారికి ఆస్లా అనే కూతురుంది. ‘‘శిధిలమైన నా జీవితాన్ని మళ్లీ నిర్మించడంతోపాటు దాన్ని నందనవనంగా మార్చేసింది జిల్'' అని బైడెన్ పదే పదే చెబుతుంటారు. జిల్ బైడెన్ ‘బ్రెస్ట్ హెల్త్ ఇనిషియేటివ్' పేరుతో ఉచిత క్యాన్సర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాగా, జోబైడెన్ పై ఓ మహిళా ప్రొఫెసర్(అనితా హిల్) లైంగికదాడి ఆరోపణలు చేసిన సమయంలో జిల్ భర్తను వెనకేసుకొచ్చి విమర్శలపాలయ్యారు.

English summary
Moments before taking the oath as us president at the US Capitol for the inauguration, Joe Biden sent a tweet to his wife and to-be first lady Jill Biden. "I love you, Jilly, and I couldn't be more grateful to have you with me on the journey ahead." says joe biden. How Tragedy And Resilience Prepared Joe Biden To Meet A Moment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X