హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై బిగ్ షాక్..! అమెరికా కోర్టు కీలక ఆదేశాలు..!
అమెరికాలో హెచ్1బీ వీసాలకు వార్షిక ఫీజుల్ని పెంచుతూ ట్రంప్ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏడాదికి లక్ష డాలర్లకు ఈ ఫీజుల్ని పెంచింది. అయితే దీనిపై కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఈ ఫీజుల్ని కొత్తగా జారీ చేసే వీసాలకు పరిమితం చేసింది. దీంతో ఇప్పటికే హెచ్1బీ వీసాలు కలిగిన వారికి తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. అయితే కోర్టులో ఈ వీసాలపై సాగుతున్న కేసుల విచారణలో ఇవాళ మరో ట్విస్ట్ ఎదురైంది.
అమెరికాలో హెచ్1బీ వీసాల జారీకి ట్రంప్ సర్కార్ విధించిన లక్ష డాలర్ల వార్షిక ఫీజుపై దాఖలైన పిటిషన్లను విచారణ జరిపిన జిల్లా కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఫీజును వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఈ పెంపు చట్టబద్ధమైనదే అంటూ సమర్థించింది. గతంలో ఒబామా హయాంలో నియమించిన కోర్టు జడ్డి ఈ తీర్పును ఇవ్వడం విశేషం. దీంతో ట్రంప్ సర్కార్ కు హెచ్1బీ వీసా ఫీజు పెంచుకునేందుకు అనుమతి లభించిట్లయింది. అయితే ఈ తీర్పుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అప్పీళ్ల కోర్టుకు వెళ్లనుంది.

హెచ్1బీ వీసా దరఖాస్తులపై ట్రంప్ సర్కార్ విధించిన లక్ష డాలర్ల ఫీజుపై చట్టపరమైన పోరాటం ఇప్పుడు అప్పీల్ కోర్టుకు వెళ్లిందని బ్లూమ్‌బెర్గ్ కథనం తెలిపింది. అమెరికాలో అతిపెద్ద వ్యాపార లాబీయింగ్ గ్రూప్ అయిన యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, వివాదాస్పద ఖర్చు పెరుగుదలను సమర్థించిన జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ వారం అప్పీల్ నోటీసును దాఖలు చేసింది.

ఈ రుసుము పెంపు సమాఖ్య చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, వీసా జాప్యాలు, పరిమితుల మధ్య నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపై ఆధారపడే సంస్థలకు హాని కలిగిస్తుందని వాదిస్తూ అమెరికాలో పలు రాష్ట్రాలు, సంస్థలు వాజ్యాలు దాఖలు చేశాయి. అయితే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి పరిశ్రమలను ప్రభావితం చేసే ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
-
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!!












Click it and Unblock the Notifications