వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4వ అంతస్తు నుంచి జారిన చిన్నారి.. తల్లి కాపాడిన తీరు చూస్తే షాకే..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

కొలంబియా : అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ, కాస్తా జాగ్రత్తగా ఉంటే ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చని రుజువు చేస్తోంది ఈ వీడియో. కొలంబియాలో భవనంపై నుంచి కిందకు పడిపోతున్న చిన్నారిని తల్లి ఎలా కాపాడిందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు ఉంది.

కొలంబియాలోని మెడెయిన్‌ నగరంలో పని నిమిత్తం కమర్షియల్ కాంప్లెక్స్ వెళ్లిన ఓ మహిళ నాలుగో అంతస్తుకు చేరుకోవడానికి లిఫ్ట్‌లో వెళ్లింది. అలా నాలుగో అంతస్తులోకి వెళ్లగానే లిఫ్ట్‌కు ఎదురుగా ఉన్న గది దగ్గర ఆగి ఫోన్‌లో మాట్లాడుతోంది. అప్పటివరకు ఆమె చేయి పట్టుకున్న కొడుకు సడెన్‌గా మెట్ల వైపు నడిచాడు. అయితే మెట్ల పక్కన గ్రిల్ ఉండటంతో వాటిని పట్టుకుని ఆడుకునే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఆ గ్రిల్స్ సందులో నుంచి ఒక్కసారిగా జారిపడ్డాడు.

సదరు మహిళ సెల్‌ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నప్పటికీ.. తన కొడుకును ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఆ బాలుడు ఒక్కసారిగా కిందకు జారిపడటంతో వెంటనే చేతిలోని ఫోన్ పక్కన పడేసి కొడుకును రక్షించేందుకు అమాంతం దూకింది. ఆ ప్రయత్నంలో బాలుడి కాలు ఆమె చేతికి చిక్కింది. దాంతో మెల్లిమెల్లిగా రెండు చేతులతో బాలుడిని పైకి లాగింది. అంతలోపు ఆమె అరుపులతో అక్కడికి చేరుకున్న కొందరు వ్యక్తులు ఆమెకు సాయం అందించారు.

Mom Reflexes Saved Her Son From Falling Off The Fourth Floor

ప్రమాదం నుంచి బాలుడు క్షేమంగా బయటపడటంతో అక్కడున్నవారు చప్పట్లు కొట్టి ఆమెను అభినందించారు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఈ ఘటన అనంతరం తేరుకున్న ఆ కాంప్లెక్స్ అసోసియేషన్ మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుందట. గ్రిల్స్ కు సందులు లేకుండా ఫుల్ కవర్ చేయించిందట.

English summary
A CCTV footage that recorded a heart-stopping moment, is going viral on the internet. It records the astonishingly quick reflexes of this mother who stopped her toddler son from falling off a balcony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X