కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు: పలువురు మృతి

Subscribe to Oneindia Telugu

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు, హోంమంత్రిత్వశాఖ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి.

పేలుళ్లతో పాటు కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
కాబూల్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులకు సమీపంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తొలుత ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ వ్యక్తి స్టేషన్‌ ముందుకు వచ్చి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.

Multiple blasts in Kabul, casualty feared

ఇది జరిగిన కొద్ది సేపటికే మరో ప్రాంతంలోనూ రెండు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు, భద్రతాసిబ్బంది వెంటనే ఘటనాస్థలంలో సహాయకచర్యలు చేపట్టారు.

కాగా, ఈ దాడుల్లో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల, క్షతగాత్రుల సంఖ్య అధికారికంగా వెలువడలేదు. గతవారం కూడా కాబూల్‌లో వరుస పేలుళ్లు జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Multiple blasts hit PD13, PD10 Police Headquarters in Dasht-e-Barchi area in Kabul City on Wednesday afternoon. According to initial reports, another explosion occurred in Qala-e-Fatullah area.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X