• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!

By Narsimha
|

ప్యాంగ్యాంగ్:అణ్వాయుధ పరీక్షలతో కవ్వింపు చర్యలకు దిగొద్దని ఎంత చెప్నినా ఉత్తరకొరియా వినడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పలు దేశాలు ఉత్తరకొరియాను తీవ్రంగా తప్పుబట్టాయి. అయినా ఉత్తరకొరియా వైఖరిలో మార్పు రాలేదు.వ్యూహత్మకంగా అమెరికాను దెబ్బకొట్టేందుకే ఉత్తరకొరియా అణు పరీక్షలు, క్షిపణుల ప్రయోగాలను చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఉత్తరకొరియా కవ్వింపు చర్యలను నిరసిస్తూ భద్రతా మండలి అత్యవసర సమావేశంలో పలు దేశాలు సమరానికి సై అంటూ సంకేతాలు ఇచ్చాయి. అమెరికా ఓక అడుగు ముందుకేసి ఉత్తరకొరియా వ్యవహరిస్తున్న తీరును చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.

సద్దాంకు పట్టిన గతే, కిమ్‌కు హిస్టీరియా: పుతిన్ ఆగ్రహం

అమెరికా మిత్రదేశాలు ఉత్తరకొరియా వైఖరిపై మండిపడుతున్నాయి. ఉత్తరకొరియాకు పరోక్షంగా మద్దతిచ్చిన దేశాలు కూడ ప్రస్తుతం ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.

కిమ్ రూల్స్: ఫోర్న్ మూవీస్ చూసినా, జుట్టు పెంచుకొన్నా శిక్షే

తన పద్దతిని మార్చుకోవాలని ఉత్తరకొరియాకు గతంలో పరోక్షంగా మద్దతిచ్చిన దేశాలు కూడ ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తరకొరియా ఏ రకమైన వైఖరిని అవలంభిస్తోందో చూడాలి.

క్షిపణులు ప్రయోగిస్తే నష్టం సైనిక చర్య

క్షిపణులు ప్రయోగిస్తే నష్టం సైనిక చర్య

ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తే సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా రక్షణశాఖ మంత్రి జేమ్స్ మాటీస్ హెచ్చరించారు. కిమ్ ఆగడాలకు అమెరికా ప్రతి చర్య క్రూరంగా ఉంటుందని ఆ దేశ ఆర్మీ రిటైర్డ్ జనరల్ చెప్పారు. అగ్రరాజ్య దేశాధినేతలు కిమ్ చర్యలపై ఘాటైన పదజాలంతో విమర్శలు గుప్పించారు.

అమెరికా సహనానికి కారణమిదే

అమెరికా సహనానికి కారణమిదే

ఉత్తరకొరియా ఎంతగా కవ్విస్తోన్నా లిబియా, ఇరాక్, ఆఘ్ఘనిస్తాన్‌లలో మాదిరిగా సాయిధ దాడికి అమెరికా దిగడం లేదు. దక్షిణ కొరియాపై కిమ్ మారణాయుధాలను ఎక్కుపెట్టారు. ఈ కారణంగానే అమెరికా సహనాన్ని వహిస్తోంది. ఉత్తరకొరియా తన సరిహద్దుల్లో నిలిపిన సియోల్‌ను లక్ష్యంగా చేసుకొని నిలిపిన భారీ ఫిరంగులు, రాకెట్ల కారణంగా అమెరికా వెనుకడుగు వేస్తోంది.

అమెరికాను కట్టడి చేసేందుకే కిమ్

అమెరికాను కట్టడి చేసేందుకే కిమ్

దక్షిణ కొరియాకు ఆయుధసంపత్తిని సమకూరుస్తూ బలోపేతం చేస్తున్న అమెరికాను కట్టడి చేయాలన్న లక్ష్యంతో కిమ్ వ్యవహరిస్తున్నారు. దక్షిణ కొరియాకు అమెరికా సహయం నిలిపివేయడమే కాకుండా ఏటా నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను నిలిపివేయాలని ఉత్తరకొరియా డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా తన డిమాండ్లను వినకపోవడంతో క్షిపణుల ప్రయోగంతో పాటు అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉత్తరకొరియా సవాళ్ళు విసురుతోంది.

ఆయుధాలు తరలించడానికి నెలల సమయం

ఆయుధాలు తరలించడానికి నెలల సమయం

ఉత్తరకొరియాపై యుద్దం చేయడానికి ప్రస్తుతం దక్షిణ కొరియా వద్ద ఉన్న ఆయుధాలు సరిపోవు. అయితే దక్షిణ కొరియాకు ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని తరలించేందుకు నెలల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఇది ఉత్తరకొరియాకు అవకాశంగా మారనుంది. అయితే గ్వామ్ మీదుగా అత్యాధునికి వైమానిక దాడులకు అమెరికా సేనలు సిద్దంగా ఉన్నాయి.

English summary
South Korea's Defense Ministry said on Monday that North Korea appeared to be planning another missile launch, possibly of an intercontinental ballistic missile (ICBM) to show off its claimed ability to target the United States with nuclear weapons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more