వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాపిల్ ఉద్యోగి రిజైన్.. మంచి పోస్టు, వీక్లీ 3డేసే ఆఫీసు.. మరీ ఏమై ఉంటుందబ్బా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల అన్నీ ఆఫీసులు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. ఇంటి నుంచే ఎంప్లాయిస్ పనిచేశారు. దాదాపు ఏడాదిన్నర పాటు కంటిన్యూగా జరిగింది. ఇప్పుడు కార్యాలయాలు తెరిచారు. ఆఫీసుకు రావాలని ఆదేశాలు వస్తున్నాయి. మెజార్టీ పీపుల్ వస్తున్నారు.. అదీ వేరే విషయం అనుకొండి.. కానీ కొందరు ఇతర కారణాలు చెబుతున్నారు. తాము రాము, రాలేమని అంటున్నారు. దీంతో కొన్ని కంపెనీలు సరే అంటున్నాయి. మరికొన్ని రిజైన్ చేయాలని కోరుతున్నాయి.

యాపిల్ కంపెనీలో జాబ్ అంటే...

యాపిల్ కంపెనీలో జాబ్ అంటే...

యాపిల్ కంపెనీ.. వాటి బ్రాండ్‌కు ఎంత విలువో జాబ్ కూడా అంతే ప్రయారిటీ. గూగుల్, యాపిల్, టీసీఎల్.. కంపెనీలకు మంచి క్రేజ్ ఉంటుంది. చాలా మంది తమ డ్రీమ్ యాపిల్ కంపెనీలో చేరడం అని చెబుతారు. అలాంటి సంస్థలో జాబ్ రావడమే చాలా కష్టం.. మరి వచ్చిన కొలువు పోగొట్టుకోవడం అంటే మాటలు కాదు.

అవును కానీ ఒకతను.. తనను ఆఫీసుకు రావాలని కోరడంతో రానని చెప్పాడు. తప్పదు అంటే ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశాడు. జాబ్ వదిలేసిన వ్యక్తి చిన్న ఎగ్జిక్యూటివ్ కాదు.. యాపిల్ మేషిన్ లెర్నింగ్ డైరెక్టర్ ఇయాన్ గుడ్‌ఫెల్లో కావడం విశేషం.

ఆఫీసుకు వచ్చేందుకు నో..

ఆఫీసుకు వచ్చేందుకు నో..

ఈ విషయాన్ని మరో ఉద్యోగి జో షెఫర్ ట్వీట్ చేశారు. తిరిగి ఆఫీసుకు వచ్చేందుకు ఇయాన్ ఇష్టంగా లేరని.. అందుకే రాజీనామా చేశారని తెలిపారు. తన నిర్ణయాన్ని బృందంలోని సభ్యులకు ముందే తెలియజేశారని పేర్కొన్నారు. తన నిర్ణయం బాధ కలిగించి ఉంటుందని.. కానీ తప్పలేదని వివరించారు. కానీ ఇయన్ మంచి నిపుణుడు అని వివరించారు. అయితే యాపిల్ సంస్థ ఉద్యోగులు కార్యాలయం వచ్చేందుకు వెసులుబాటు కల్పించింది.

వెసులుబాటు కల్పించినా..?

వెసులుబాటు కల్పించినా..?

ఏప్రిల్ 11వ తేదీ నుంచి వారానికి ఒకసారి రావాలని కోరింది. మే 2వ తేదీ నుంచి వారానికి రెండుసార్లు రావాలని చెప్పింది. మే 23వ తేదీ నుంచి మాత్రం వారానికి మూడుసార్లు రావాల్సి ఉంటుందని చెప్పింది. వారానికి 3 రోజులు కంపల్సరీ అని చెప్పడంతో కొందరు అసంతృప్తిగా ఉన్నారు. కంపెనీ నిర్ణయంపై అన్ హ్యాపీగా ఉన్నారు. అంటే వారంలో శని, ఆదివారం సెలవు ఉంటుంది. సో మరో రెండురోజులు మాత్రం ఇంటి వద్ద నుంచి పనిచేసే వెసులుబాటు ఉంటుంది.

సీఈవోకు ఉద్యోగుల లేఖ

సీఈవోకు ఉద్యోగుల లేఖ

తర్వాత ఉద్యోగులు యాపిల్ సీఈవో టిమ్ కూక్‌కు లేఖ కూడా రాశారు. ఒక్కసారిగా కార్యాలయానికి రావాలంటే ఇబ్బందిగా ఉంది.. కుటుంబాలను వదిలి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే చాలా చక్కగా పనిచేస్తున్నామని తెలిపారు. తాము కంపెనీలో భాగం అని.. ఆఫీసుకు రావాలనే నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ వినతిని తేలికగా తీసుకోవద్దు అని సూచించారు.

English summary
Apple’s Director of Machine learning Ian Goodfellow left his job at Apple after he asked to return to office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X