ముందు కాల్చేస్తాం-తర్వాతే చర్చలు.! ట్రంప్ కు డెన్మార్క్ వార్నింగ్.!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకున్న అధికారంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముందుగా విదేశీయుల్ని తమ దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, ఆ తర్వాత స్వదేశంలో ఉన్న వలసల్ని తరిమేయడం, ఇప్పుడు ఇతర దేశాల్ని నయానో భయానో బెదిరించి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం చేస్తున్నారు. ఇదే క్రమంలో గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు డెన్మార్క్ గట్టి షాక్ ఇచ్చింది.
గ్రీన్ ల్యాండ్ ను ఆక్రమించుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహంగా ఉన్న డెన్మార్క్ తీవ్ర హెచ్చరికలు చేసింది. తమ భూభూగాన్ని ఎవరైనా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే ముందు కాల్చేసి (shoot first) ఆ తర్వాత చర్చలు జరుపుతామని అమెరికాను హెచ్చరించింది. ఈ మేరకు కోల్డా వార్ సమయంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ కు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాల నిబంధనను తిరిగి తెరపైకి తెస్తూ తమ సైనికులకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది.

డెన్మార్క్ భూభాగంపై ఎవరైనా దాడి చేస్తే సైనికులు వెంటనే పోరాటం ప్రారంభించి, తమ కమాండర్ల ఆదేశాల కోసం వేచి ఉండకుండా కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణ కోసం అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలు చేసింది. ఏదైనా విదేశీ దళం డెన్మార్క్ భూభాగాన్ని బెదిరిస్తే, ఆదేశాల కోసం వేచి ఉండకుండా దళాలు ముందుగా కాల్పులు జరపాలని స్పష్టంగా పేర్కొంది.

వాస్తవానికి 1940 ఏప్రిల్‌లో నాజీ జర్మనీ డెన్మార్క్‌పై దాడి చేసినప్పుడు ఈ రూల్ ను తీసుకొచ్చారు. దీని ఫలితంగా డెన్మార్క్ దేశంలో కమ్యూనికేషన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అది నేటికీ అమలులో ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లోని డెన్మార్క్ సైనిక అధికారమైన జాయింట్ ఆర్కిటిక్ కమాండ్, చివరికి ద్వీపంపై దాడిగా పరిగణించబడే వాటిని అంచనా వేసే సంస్థ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెన్మార్క్ పర్యవేక్షణలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై దృష్టి సారించి, అవసరమైతే బలవంతంగా స్వయంప్రతిపత్తి కలిగిన భూమిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని పదే పదే బెదిరిస్తున్న నేపథ్యంలో ఈ రూల్ మరోసారితెరపైకి వచ్చింది.
-
ఇరాన్ యుద్ధంలో ఓడిపోతోంది ఎవరు ? తెరవెనుక ఏం జరుగుతోంది ? -
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
ఇరాన్ తో డీల్ లేనట్లేనా ? సర్వనాశనమే- ట్రంప్ ఫైనల్ వార్నింగ్..! -
ఇరాన్ లో మా టార్గెట్ అదే..! అసలు ప్లాన్ బయటపెట్టిన ట్రంప్..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications