వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నమో రామచంద్ర అంటూ శ్రీలంక ఆర్థనాదాలు: కిలో బియ్యం రూ. 220, పాలపొడి రూ. 1900

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక అన్నమో రామచంద్ర అంటోంది. విపరీతమైన ద్రవ్యోల్బణంతో భారీగా పెరిగిన నిత్యావసర ధరలు సామాన్యులను పస్తులుండే పరిస్థితికి తీసుకొచ్చాయి. చరిత్రలో ఎన్నడూలేని విధంగా శ్రీలంక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు కూడా ఆకాశన్నంటడంతో సామాన్య ప్రజలు ఆర్థనాదాలు చేస్తున్నారు. అనేక మంది శ్రీలంక తమిళులు భారత బాటపడుతున్నారు. అదే సమయంలో భారత్.. శ్రీలంకకు భారీ సాయాన్ని అందించింది.

శ్రీలంకలో భారీగా పెరిగిన నిత్యావసర ధరలు

శ్రీలంకలో భారీగా పెరిగిన నిత్యావసర ధరలు

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన కరెన్సీ శ్రీలంకలో ప్రాథమిక వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అపూర్వమైన ఆర్థిక మాంద్యం కారణంగా, ద్వీప దేశంలోని ప్రజలు ఇంధనం, ఆహారం, మందులు కొనడానికి గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. చాలా తరచుగా, చాలా మంది ఖాళీ చేతులతో వెళ్లిపోతున్నారు. దుకాణంలో సరుకులు అయిపోతున్నాయి. సరుకులకు సరిపడా డబ్బులు సామాన్యుల వద్ద ఉండటం లేదు.

శ్రీలంకలో కిలో బియ్యం రూ. 220

శ్రీలంకలో కిలో బియ్యం రూ. 220

శ్రీలంక వాసులు రాజధాని కొలంబోలో సూపర్ మార్కెట్లో తమ రోజువారీ కిరాణా సామాగ్రి కోసం భారీ మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. కూరగాయల ధరలు ఇటీవలి వారాల్లో రెండింతలు పెరిగాయి, బియ్యం, గోధుమలు వంటి ప్రధాన వస్తువులు వరుసగా కిలో రూ. 220, రూ. 190 చొప్పున విక్రయిస్తుండటం గమనార్హం.

శ్రీలంక ద్రవ్యోల్బణం 17.5 శాతానికి చేరిక, కిలో పాలపొడి 1900

శ్రీలంక ద్రవ్యోల్బణం 17.5 శాతానికి చేరిక, కిలో పాలపొడి 1900

కిలో పంచదార రూ.240 పలుకగా, కొబ్బరినూనె లీటరు రూ.850కి భారీగా లభించింది. ఒక్క గుడ్డు ధర రూ. 30. ఇంకా నమ్మలేనంతగా, 1 కిలోల పాలపొడి ప్యాక్ ఇప్పుడు రూ.1900కి రిటైల్ అవుతుంది. ఫిబ్రవరిలో శ్రీలంక రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 17.5 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం 25 శాతానికి పైగా పెరిగింది, ఇది ఆహారం, తృణధాన్యాల ధరలను అధికంగా పెంచింది. మందులు, పాలపొడి కొరత కూడా తీవ్రంగా ఉంది.

నిరసనలు.. కర్ఫ్యూలో శ్రీలంక

నిరసనలు.. కర్ఫ్యూలో శ్రీలంక

సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. రాజధానితో సహా దేశంలోని అనేక ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయి, నిత్యావసర వస్తువుల కొరత, సుదీర్ఘ విద్యుత్తు అంతరాయాలకు రాజపక్సే పాలనను నిందించిన ఆందోళనకారులు.విస్తృతమైన అశాంతిని అణిచివేసేందుకు, అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, ఆ తర్వాత సామూహిక ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపునిస్తూ 36 గంటల పాటు కర్ఫ్యూ విధించారు.

English summary
Sri Lanka crisis: Rice Rs 220/kg, milk powder Rs 1900/kg: Skyrocketing rates at supermarket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X