వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గార్డ్ ఆఫ్ హానర్: లండన్‌లో మోడీ కోసం గుజరాతీ పోలీస్‌

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కోసం అక్కడి ప్రభుత్వం గుజరాత్‌కు చెందిన ప్రవాస భారతీయుడైన విశాల్‌ గోసాయిన్‌ అనే పోలీసు అధికారిని ప్రత్యేకంగా నియమించింది. మోడీ బ్రిటన్‌ పర్యటన సందర్భంగా విశాల్‌కు అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.

కాగా, శుక్రవారం వెంబ్లీ స్టేడియంలో జరిగే ప్రధాని కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాల్‌ అక్కడ విధినిర్వహణలో ఉంటాడు. మోడీ ప్రసంగం వినడానికి వచ్చే భారతీయులతో సంభాషించడం తేలికవుతుందని బ్రిటన్ అధికారులు విశాల్‌ను అక్కడ నియమించారు.

modi

ఈ సందర్భంగా ప్రధాని మోడీతో మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడతావన్న ప్రశ్నకు విశాల్‌ స్పందిస్తూ.. 'లండన్‌లో నివసిస్తున్న భారతీయుణ్ని నేను. భారతీయుడినైనందుకు గర్విస్తున్నాను. జై బజరంగ్‌ భళీ!' అని సమాధానమిచ్చాడు.

ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా నియమించపడటం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. ఈ మంచి కార్యక్రమంలో భాగమవుతున్నందుకు చాలా చాలా ప్రత్యేకంగా భావిస్తున్నట్లు విశాల్ తెలిపాడు.

ప్రధాని మోడీని చూడడానికి తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. కాగా, మోడీ ప్రసంగించే సభకు సుమారు 60వేల మంది ప్రవాసులు హాజరుకానున్నారు.

మోడీకి గార్డ్ ఆఫ్ హానర్

భారత ప్రధాని నరేంద్ర మోడీకి లండన్‌లో గురువారం ఘన స్వాగతం లభించింది. అనంతరం ఆయనకు కింగ్ చార్ల్స్ స్ట్రీట్‌లో సైనికులు గౌరవ వందనం సమర్పించారు.

English summary
As Prime Minister Narendra Modi arrived in London on Thursday for a packed three-day visit, one British policeman struggled to keep his excitement in check.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X