వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ జంట పేలుళ్లు: 13 మంది మృతి, పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ విమానాశ్రయం వెలుపల భారీ పేలుడు సంభవించింది. ఆప్ఘాన్ నుంచి తమ దేశ పౌరులను ఆయా దేశాలు తరలిస్తున్న క్రమంలో గురువారం సాయంత్రం ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగం వెల్లడించింది.

ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అయ్యుండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే, పేలుడు ఘటనలో ప్రాణ నస్టం వివరాలు తెలియరాలేదని అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధిాజన్ కిర్బీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కాగా, పేలుడు ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెంటగాన్ అధికారులు సమాచారం ఇచ్చారు.

Explosions at Kabul Airport; Casualties Unclear

కాగా, ఈ పేలుడు ఘటనలో 13 మంది సైనికాధికారులు, పౌరులు మృతి చెందారు. వీరిలో అమెరికాకు చెందిన ముగ్గురు సైనికాధికారులు ఉన్నట్లు తెలిసింది. పేలుడు ఘటనలో గాయపడినవారిని తరలిస్తున్న దృశ్యాలు ఆప్ఘాన్ మీడియాలో ప్రసారమవుతున్నాయి. మొదట బారాన్ హోటల్ వద్ద ఓ పేలుడు జరిగినట్లు తెలిసింది. ఆ పేలుడు ఘటనలో ఎంతమంది గాయపడ్డారో తెలియరాలేదు. కాబూల్ విమానాశ్రయంలో వేలాది మంది ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఐఎస్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని తాలిబన్లు అనుమానిస్తున్నట్లు సమాచారం.

ఆగస్టు 31 వరకు తాలిబన్లు గడువు ఇచ్చిన నేపథ్యంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు అనుమానించినట్లు పేలుళ్లు, దాడులు జరగడం గమనార్హం. తాలిబన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని గురువారం ఉదయమే అమెరికా రక్షణ శాఖ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ హెచ్చరికలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. తాలిబన్లే ఈ పేలుళ్లకు పాల్పడ్డారా? లేక తాలిబన్లకు మద్దతుగా ఇతర ఉగ్రవాద సంస్థలు ఈ దారుణానికి ఒడిగట్టాయా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇది ఇలావుండగా, ఆగస్టు 31వ తేదీ లోపు ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులందరిని తరలించడం తక్షణం ఉన్న ప్రధాన కర్తవ్యమని ప్రతిపక్ష పార్టీలకు తెలియజేశారు విదేశాంగ మంత్రి జై శంకర్. ఆయన నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయ తరలింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు విపక్ష నేతలకు ఈ సమావేశంలో తెలియజేశారు .

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకూ దారుణంగా మారుతున్నాయని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమను తరలించాలని సహాయం కోసం దాదాపు 15,000 మంది ప్రజలు ప్రభుత్వాన్ని సంప్రదించారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. తరలింపుకు యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నామని చెప్పారు . ఇదే సమయంలో అమెరికా, రష్యా, చైనా వంటి ఇతర దేశాలు తీసుకుంటున్న తరలింపు చర్యల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విపక్షాలకు వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మందిని తరలించడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని, మంత్రి జైశంకర్ చెప్పినట్లు సమాచారం. భారతీయులను తరలించడం "ప్రధాన ప్రాధాన్యత" అని ఆయన విపక్ష నేతలకు నొక్కి చెప్పినట్లు తెలుస్తుంది.

Recommended Video

Prime Minister Narendra Modi on Tuesday spoke to Russian President Vladimir Putin on Afghanistan

చాలా క్లిష్ట పరిస్థితులలో, ముఖ్యంగా విమానాశ్రయంలో తరలింపు కార్యకలాపాలను చేపట్టామని ఆయన చెప్పారు. మా తక్షణ ఆందోళన , మాకు ఉన్న ముఖ్యమైన పని ముందు అక్కడి నుంచి భారత్ కు రావలసిన వారిని తరలించటమే అని వెల్లడించారు. ఇక తమ దీర్ఘకాలిక ఆసక్తి ఆఫ్ఘన్ ప్రజల స్నేహం అని సమావేశం తర్వాత జైశంకర్ ట్వీట్ చేశారు. కాబూల్‌ని ఆక్రమించిన కొన్ని వారాల్లో అమెరికా, దాని మిత్రదేశాలకు దోహాలో ఇచ్చిన వాగ్దానాలను తాలిబన్లు ఉల్లంఘించారని ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులకు చెప్పినట్లు తెలిపింది. గత వారం కాబూల్‌పై తాలిబన్లు నియంత్రణలోకి రాకముందే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామాకు బదులుగా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించిందని, మారుతున్న తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభించినట్లు చెప్పారు.

English summary
Explosions at Kabul Airport; Casualties Unclear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X