ఆ దేశంపై 100 శాతం సుంకాలు..! ట్రంప్ సంచలనం..
చైనాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే 100 శాతం సుంకాలు విధిస్తామని కెనడాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కెనడా- చైనా మధ్య ప్రాథమికంగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య టారిఫ్ లు తగ్గించుకోవడం, వీసా రూల్స్ సడలింపు తదితర అంశాలపై చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో కెనడాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే కెనడాపై 100 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. చైనాతో కెనడా జరిపిన వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చైనా- కెనడా మధ్య ట్రేడ్ డీల్ ఓకే అయితే.. కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం టారిఫ్ లు విధిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అగ్రరాజ్యంపై ఆధారపడటాన్ని కెనడా తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.
చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే కెనడాపై 100 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా పోస్టు చేశారు. చైనాతో ట్రేడ్ వల్ల కెనడా పూర్తిగా దెబ్బతింటుందని సూచనలు చేశారు. కెనడా తన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కోల్పోతుందని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. మరోవైపు ఇటీవల చైనా- కెనడా ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి. ఈ ట్రేడ్ డీల్ ప్రకారం.. చైనా నుండి వచ్చే ఎలక్ట్రిక్ వాహనాలపై కెనడా పన్నులు తగ్గించనుంది. అలాగే కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను తగ్గించేందుకు చైనా అంగీకరించింది.

ఇక అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకే కెనడా.. చైనాతో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కెనడా ప్రధాని మార్క్ కార్నే ఇటీవల దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా మాట్లాడుతూ అమెరికాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కెనెడియన్ల వల్లనే అమెరికా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ట్రంప్ నకు ఆగ్రహం తెప్పించిన నేపథ్యంలో 'బోర్డ్ ఆఫ్ పీస్' (శాంతి మండలి) నుండి కార్నేకు ఇచ్చిన ఆహ్వానాన్ని రద్దు చేశారు.
-
డొనాల్డ్ ట్రంప్ నాన్చివేత ధోరణి- 19 నిమిషాల ప్రసంగంలో ఇరాన్ భవిష్యత్ -
నో హార్ముజ్, నో డీల్..! ఒట్టి చేతులతో ఇరాన్ వీడనున్న ట్రంప్..! -
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..?












Click it and Unblock the Notifications