కొద్దిసేపు నిలిచిన వాట్సాప్ సేవలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  WhatsApp Is Down In Several Countries 'వాట్సాప్‌ డౌన్‌' | Oneindia Telugu

  న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ సేవలు కొద్దిసేపు నిలిచిపోయాయి. భారత్‌ సహా అమెరికా, ఇటలీ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్‌, జర్మనీ దేశాల్లో ఈ సర్వీసులు నిలిచిపోయినట్లు సమాచారం.వాట్సాప్ శుక్రవారం హఠాత్తుగా క్రాష్ అయింది. మళ్లీ పాక్షికంగా పునరుద్ధరణ జరిగింది. సర్వర్ ప్రోబ్లమ్ వల్ల ఇలా జరిగిందని తెలుస్తోంది.

  WhatsApp crash upsets millions globally

  'వాట్సాప్‌ డౌన్‌' హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి వాట్సాప్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. దాంతో నెటిజన్లు వాట్సాప్‌తో సమస్యగా ఉందంటూ ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు.

  వాట్సాప్‌లో మెసేజ్‌ వెళ్లినట్లు టిక్‌ మార్క్‌ చూపించడంలేదని కొందరు, అసలు మెసేజ్‌లే వెళ్లడం లేదని మరికొందరు కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం వాట్సాప్‌ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.

  చాట్స్, కాంటాక్ట్స్ లోడ్ చేసేటపుడు ప్రారంభంలో పని చేయనట్లు కనిపించలేదు. అయితే చాట్‌లో ప్రవేశించిన తర్వాత కనెక్టింగ్ అనే మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మెసేజ్‌లను పంపించడం, స్వీకరించడం నిలిచిపోయింది.

  ఈ పరిణామాలపై వాట్సాప్ స్పందించింది. సమస్యను గుర్తించినట్లు తెలిపింది. దీనిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఎంత సమయంలో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందో వెల్లడించలేదు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Instant messenger, WhatsApp is currently experiencing downtime in South Africa and in other countries across the world. Over 500 reports from South Africa were submitted to outage reporting website, Downdetector, from 10:18am.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి